‘కబాలి’ వెయ్యి కోట్లు.?

రజనీకాంత్‌ సినిమాకి ఫిగర్‌ ఎంతైనా రాసేసుకోవచ్చు. ఎందుకంటే ఆయన సూపర్‌ స్టార్‌. వాస్తవ దూరమైన ఫీట్స్‌ ఆయన సినిమాల్లో చాలా చూస్తాం. ఈ మధ్య మరీ దారుణంగా ఆయనతో సినిమాలు చేసే దర్శక నిర్మాతలు…

రజనీకాంత్‌ సినిమాకి ఫిగర్‌ ఎంతైనా రాసేసుకోవచ్చు. ఎందుకంటే ఆయన సూపర్‌ స్టార్‌. వాస్తవ దూరమైన ఫీట్స్‌ ఆయన సినిమాల్లో చాలా చూస్తాం. ఈ మధ్య మరీ దారుణంగా ఆయనతో సినిమాలు చేసే దర్శక నిర్మాతలు ఆయన్నో సూపర్‌ పవర్‌గా మార్చేస్తున్నారు. నేల విడిచి సాము చేస్తూ డిస్ట్రిబ్యూటర్లనీ, ఎగ్జిబిటర్లనీ ముంచేస్తున్నారు. 'కొచాడియాన్‌', 'లింగ' సినిమాలు ఏ స్థాయిలో నష్టాలు మిగిల్చాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 

ఇక, 'కబాలి' కోసం ప్రచారం పేరుతో జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. తెలుగులో ఈ సినిమా దారుణ నష్టాల్ని మిగిల్చింది. తమిళంలోనూ, ఇతర భాషల్లోనూ సేమ్‌ సీన్‌. అయినాసరే, 'కబాలి' సినిమా 800 కోట్లు వసూలు చేసిందనే ప్రచారం మాత్రం ఇంకా ఆగకపోవడం ఆశ్చర్యకరమే. రజనీకాంత్‌ హీరోగా ప్రస్తుతం 'రోబో 2.0' సినిమా తెరకెక్కుతోంది. శంకర్‌ రూపొందిస్తున్న సినిమా ఇది. 

'రోబో 2.0' తర్వాత రజనీకాంత్‌ సినిమాల్లో కొనసాగుతాడా.? లేదా.? అసలు, 'రోబో 2.0' అయినా పూర్తవుతుందా.? లేదా.? ఇలా సవాలక్ష సందేహాలు తెరపైకొస్తున్నాయి. కారణం, రజనీకాంత్‌ అనారోగ్యమే. 'కబాలి' సినిమా ప్రమోషన్‌కే రజనీకాంత్‌ రాలేని పరిస్థితి. రజనీకాంత్‌ అనారోగ్యంతో నిర్మాత బెంబేలెత్తిపోయాడు. ఎలాగైతేనేం, రజనీకాంత్‌ కోలుకున్నాడు. ఇంతలోనే 'కబాలి-2' సినిమా రాబోతోందనీ, అదీ డిసెంబర్‌లోనే సెట్స్‌పైకి వస్తోందన్న గాసిప్‌ పుట్టుకొచ్చింది. 

'కబాలి 2' వెయ్యి కోట్లపైనే వసూలు చేస్తుందనే అంచనాలు అప్పుడే స్ప్రెడ్‌ చేసేస్తున్నారు కొందరు ఔత్సాహికులు. అది సాధ్యమేనా.? వాట్‌ ఏ నాన్సెన్స్‌.. అని సగటు సినీ అభిమాని ముక్కున వేలేసుకుంటున్నాడు.