బోయపాటికి కొత్తగా వుంది

తాను తీసింది సినిమా..చెప్పిందే యాక్షన్ అన్నట్లు నడిచిపోయిన వాళ్లకు గీతా ఆర్ట్స్ లో సినిమా చేయడం అంటే కాస్త కష్టంగానే వుంటుంది. అక్కడ అంత సులువుగా ఒప్పించడం సాధ్యం కాదు. దర్శకుడు బోయపాటికి ఇది…

తాను తీసింది సినిమా..చెప్పిందే యాక్షన్ అన్నట్లు నడిచిపోయిన వాళ్లకు గీతా ఆర్ట్స్ లో సినిమా చేయడం అంటే కాస్త కష్టంగానే వుంటుంది. అక్కడ అంత సులువుగా ఒప్పించడం సాధ్యం కాదు. దర్శకుడు బోయపాటికి ఇది పూర్తిగా అర్థమైపోయిందన్న గుసగుసలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. బన్నీ కోసం సరైనోడు.. కథను పూర్తి చేసి ఓకే చేయించుకోవడానికే చాలా టైమ్ పట్టింది. సెకండాఫ్ మొత్తం స్క్రాప్ చేసి, కొత్తగా తయారుచేసే వరకు సెట్ మీదకే వెళ్లలేదు. వెళ్లిన తరువాత క్వాలిటీ దగ్గర ఎక్కడా రాజీపడకుండా చేసుకుంటూ వస్తున్నారు. 

ఇక కొద్ది రోజుల్లో అన్నపూర్ణలో క్లయిమాక్స్ కూడా స్టార్ట్ అవుతుంది. ఈ దశలో సినిమాను మొత్తం ఓ సారి చెక్ చేసుకుంటుంటున్నట్లు వార్తలు వినవస్తున్నాయి.  ఇప్పుడు ప్రతి సినిమా విజయం అన్నది ఇటు హీరోలకు, దర్శకులకు తప్పనిసరి అవసరంగా మారింది. అదే సమయంలో ఏ మాత్రం తేడా వున్నా జనం సంతృప్తి చెందడం లేదు. ఇటీవల నాగ్ కూడా తన సోగ్గాడే చిన్ని నాయనా విషయంలో జాగ్రత్తలు తీసుకుని, చాలా వరకు రీ షూట్ చేసాడు. పైగా రీషూట్ చేయడం తప్పు కాదని, చూసి నచ్చకపోయినా, రీషూట్ చేయకపోవడం తప్పు అని స్టేట్ మెంట్ ఇచ్చాడు.

గీతా ఆర్ట్స్ అరవింద్ కూడా సరైనోడు సినిమా చూసి, కొన్ని సూచనలు చెప్పినట్లు,  ఆ మేరకు బోయపాటి చిన్న చిన్న టచప్ లు చేసినట్లు, చేస్తున్నట్లు గ్యాసిప్ లు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. ఈసినిమా విషయంలో బన్నీ, అరవింద్ చాలా కేర్ గా వున్నారు. ఇప్పుడు బన్నీ రేంజ్ బాగా పెరిగింది. ఈ సినిమా హిట్ కొడితే టాప్ రేంజ్ కు వెళ్లిపోతాడు. తరువాత విక్రమ్ కుమార్ సినిమా కూడా హిట్ కొడితే టాప్ ఛెయిర్లో ఫిక్సయిపోతాడు.

చిరంజీవి తరువాత పవన్..ఆ తరువాత బన్నీ అన్నట్లు మెగా లెగసీ ముందుకు సాగుతుంది.