ఇక నో మెగా ఫ్యాన్స్? ఓన్లీ బన్నీ ఫ్యాన్స్?

మెగా ఫ్యాన్స్..అన్ని బహువచనంగా వాడుతున్నారు ఇన్నాళ్లు..చిరంజీవి..పవన్, రామ్ చరణ్, బన్నీ, ఇంకా చోటా..మోటా జనాల అభిమానులు అందరి ఉమ్మడి ప్లాట్ ఫారమ్ అది. కానీ ఇది కాస్త ఇబ్బందిగానే వుందని చాలా సార్లు టాక్…

మెగా ఫ్యాన్స్..అన్ని బహువచనంగా వాడుతున్నారు ఇన్నాళ్లు..చిరంజీవి..పవన్, రామ్ చరణ్, బన్నీ, ఇంకా చోటా..మోటా జనాల అభిమానులు అందరి ఉమ్మడి ప్లాట్ ఫారమ్ అది. కానీ ఇది కాస్త ఇబ్బందిగానే వుందని చాలా సార్లు టాక్ వినిపించింది. మెగా ఫ్యాన్స్ లో పవర్ స్టార్ ఫ్యాన్స్ వేరు. మెగా ఫంక్షన్లలో వాళ్ల సందడి వేరు. అదో తలకాయనొప్పి. ఇక తను సంపాదించిన స్టార్ డమ్, తన కోసం తయారైన మెగా ఫ్యాన్స్ ను మొత్తం అందరూ వాడేసుకుంటున్నారని చిరు ఫీలింగ్ వుందని ఓ టాక్. 
దాని వల్లే ఆ మధ్య కొంతకాలం చిరు, చరణ్ లు అల్లు అరవింద్ కు నడుమ కాస్త ఎడం పెరిగిందని టాక్. ఇలాంటి బ్యాక్ డ్రాప్ లో బన్నీ కొత్త స్టెప్ వేసినట్లు వినికిడి. తనకంటూ ఓ ఫ్యాన్ బేస్ ను తయారుచేసుకుంటున్నట్లు తెలుస్తోంది. బన్నీ ఫ్యాన్స్ కోసం ఆల్ ఇండియా అల్లుఫ్యాన్స్ అంటూ ఓ కొత్త ఫ్లాట్ ఫారమ్ తయారైందట. అంటే ఇందులో మెగాభిమానులు వుంటే వుండొచ్చు..లేదా..బన్నీఫ్యాన్స్ సోలోగా వుండొచ్చు..కానీ వారందరికీ ఒకటే పేరు..అల్లు ఫ్యాన్స్ లేదా బన్నీ ఫ్యాన్స్. 

అంటే బన్నీ ఇక తన స్టామినా తనదిగా మార్చుకుంటున్నట్లు కనిపిస్తోంది. జులాయి, రేసుగుర్రం, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలతో బన్నీ స్టార్ హీరో అయిపోయాడు. బోయపాటి సినిమా, ఆ తరువాత విక్రమ్ కుమార్ సినిమా అంటే సోలోగానే యాభై కోట్ల రేంజ్ లో వుంటాడు. మరి ఈ రేంజ్ కు వచ్చాక కూడా వేరే బ్రాండింగ్ ఎందుకు..తన బ్రాండ్ తను తయారుచేసుకోక. అందుకే కావచ్చు..బన్నీ అభిమానులు ఈ పనికి దిగి వుంటారు.