Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఆ పాత్ర క్లిక్ అయితే ఆ సినిమా హిట్టే

ఆ పాత్ర క్లిక్ అయితే ఆ సినిమా హిట్టే

సోగ్గాడే చిన్ని నాయనా..నాన్న ఏఎన్నార్ సినిమాలో పాటను మకుటంగా చేసుకుని పండగ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు అక్కినేని నాగార్జున. ఓ కొరియన్ సినిమా ఆధారంగా తయారైన కథతో సూర్య రాక్షసుడు సినిమా జనం ముందుకు వచ్చింది. ఆ సినిమాకు ఈ సినిమాకు పోలికలు వున్నాయని టాక్. దాంతో నాగ్ అప్పటి వరకు చేసినదాంట్లో చాలా భాగం పక్కన పడేయించి, మళ్లీ రీ షూట్ చేయించారు.

సినిమా మొత్తాన్ని అవుట్ అండ్ అవుట్ ఫన్ అండ్ ఎంటర్ టైనర్ గా మార్చేసారు. ఇప్పుడు సినిమాకు మాంచి హైప్ వచ్చింది. సినిమాలో తండ్రి పాత్రకు సంబంధించినంత వరకు ఓ ట్విస్ట్ వుందని, అది జనాలకు పడితే, సినిమా హిట్టేనని టాక్. తండ్రి పాత్ర ట్విస్ట్ జనాలకు ఏకారణం చేత అయినా నచ్చకపోయినా కూడా ఫరవాలేదనే విధంగా సినిమాను మలిచారట. సినిమా లైన్, ట్విస్ట్ ఎలా వున్నా, ఆడియన్స్ ఎంజాయ్ చేసేసాలా స్క్రిప్ట్ ను దగ్గర వుండి నాగ్ మార్పించాడన్నది టాలీవుడ్ టాక్.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?