‘త్రిపుర’ విడుదలకు ముందే టివివాళ్లు కొనేశారు…

సాధారణంగా ఏ సినిమా అయినా విడుదలయ్యాక,  అది హిట్టా, ఫట్టా, లేక మిడిల్‌లో ఉందా… అని చూసుకుని దాని ఫలితం తేలాక మాత్రమే టివి ఛానెల్స్ శాటిలైట్ హక్కుల కోసం రంగంలోకి దిగుతాయి. (కొన్ని…

సాధారణంగా ఏ సినిమా అయినా విడుదలయ్యాక,  అది హిట్టా, ఫట్టా, లేక మిడిల్‌లో ఉందా… అని చూసుకుని దాని ఫలితం తేలాక మాత్రమే టివి ఛానెల్స్ శాటిలైట్ హక్కుల కోసం రంగంలోకి దిగుతాయి. (కొన్ని చిన్న సినిమాలకైతే అసలు హక్కుల మాట దేవుడెరుగు… ఉత్తినే ఇస్తామన్నా వద్దు పొమ్మనేంత ఘెరంగానూ తిరస్కరిస్తాయనుకోండి అది వేరే విషయం)  కలర్స్ స్వాతి హీరోయిన్‌గా త్వరలో రానున్న ‘త్రిపుర’ సినిమా మాత్రం ఈ రొటీన్ బిజినెస్‌ని తిరగరాసిందని ఫిలింనగర్ టాక్. 

ఈ సినిమా ఇంకా విడుదల కాకుండానే టివి హక్కుల్ని ఒక ప్రముఖ తెలుగు చానెల్ స్వంతం చేసుకుందని సమాచారం. దీని కోసం మంచి ఫ్యాన్సీ రేటు కూడా సదరు చానెల్ వాళ్లు ముట్ట చెప్పారట. దీనిపై సినిమా రూపకర్తలు తొలుత కొంచెం ఆలోచించినా… విడుదలయ్యాక, రిజల్ట్ బాగా వస్తే సరే లేకపోతే అసలే పెద్ద స్టార్స్ లేని సినిమా… కాస్త అటూ ఇటూ అయితే… ఎందుకొచ్చిన బాధ అనుకున్నారేమో… ‘త్రిపుర’ టివి రైట్స్ అమ్మేశారట. 

టివి ప్రోగ్రామ్స్‌లో కలర్స్‌తో కొత్త ట్రెండ్ సృష్టించిన స్వాతి… తన తొలి హీరోయిన్ ఓరియెంటెడ్ ఫిల్మ్‌తోనూ సెన్సేషన్ సృష్టిస్తుందని ఆశించవచ్చేమో…