సినిమా డాక్టర్ లా త్రివిక్రమ్

సినిమాల్లో డాక్టర్ లు భలే చెబుతారు. సాధారణంగా..24గంటలు గడిస్తే గానీ ఏ సంగతీ చెప్పలేము..అంటారు..ఇప్పుడు దర్శకుడు త్రివిక్రమ్ కూడా అలాగే మాట్లాడుతున్నారు. సోమవారం దాటితే కానీ సత్యమూర్తి సినిమా సంగతి ఏ విషయం చెప్పలేమన్నారు.…

సినిమాల్లో డాక్టర్ లు భలే చెబుతారు. సాధారణంగా..24గంటలు గడిస్తే గానీ ఏ సంగతీ చెప్పలేము..అంటారు..ఇప్పుడు దర్శకుడు త్రివిక్రమ్ కూడా అలాగే మాట్లాడుతున్నారు. సోమవారం దాటితే కానీ సత్యమూర్తి సినిమా సంగతి ఏ విషయం చెప్పలేమన్నారు. ఇప్పటికైతే కలెక్షన్లు బాగానే వున్నాయి..నిర్మాత సేఫ్. మిగిలిన విషయాలు సోమవారం తరువాత గానీ చెప్పలేమన్నారు. 

ఇది పక్కా కమర్షియల్ సినిమా కాదు కదా..స్లొగా జనంలోకి వెళ్తుంది..అందువల్ల సోమవారం వరకు ఏ సంగతి చెప్పలేనన్నారు. తాను సమీక్షలు చదవనని, తన సినిమాలు చూసినా, తనకే తప్పులు కనిపిస్తాయని, అందువల్ల తాను అవేవీ పట్టించుకోనని అన్నారు. సత్యమూర్తి సినిమాపై దర్ళకుడు త్రివిక్రమ్ మీడియాతో ఈ రోజు మాట్లాడారు.

సినిమా లో అసలు కథ కన్న పిట్టకథలు ఎక్కువగా వున్నాయన్నదానికి సమాధానం చెబుతూ, ఓ నవల ఎలా వుంటుందో అలా ప్రెజెంట్ చేద్దామని ప్రయత్నించా అన్నారు. ఎవరో ఒకరు మొదలు పెట్టాలి కదా ఆయన అన్నారు. పాత్రలు మన లోంచే పుడతాయి..డయాబెటీస్ అన్నది కామన్ అని చెప్పడానికి హీరోయిన్ కు డయాబెటీస్ వున్నట్లు చూపించా అన్నారు. మూడు వందల కొట్లు ఒక్క రోజులో పోవు కదా..అందుకే కాస్త డ్రమటైజ్ చేయాల్సి వచ్చిందన్నారు. 

కోబలి సినిమా వుంటుదని, కానీ ఆలస్యం అవుతుందని అన్నారు. మహేష్ బాబుతో సినిమా ఇంకా కన్ ఫర్మ్ కాలేదన్నారు. ​