నో ఫైటింగ్..నో సాయం..పవన్

చెన్నయ్ లో తెలుగు భాష వ్యవహారంపై అక్కడకు వెళ్లి దీక్షసాగిస్తా అన్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గతంలో. అది అలాగే ఆగిపోయింది. సరే ఇప్పుడు ఘోర విపత్తు వచ్చింది ఆ మహా నగరానికి.…

చెన్నయ్ లో తెలుగు భాష వ్యవహారంపై అక్కడకు వెళ్లి దీక్షసాగిస్తా అన్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గతంలో. అది అలాగే ఆగిపోయింది. సరే ఇప్పుడు ఘోర విపత్తు వచ్చింది ఆ మహా నగరానికి. మన స్టార్లు అంతా యథాశక్తి సాయం ప్రకటించారు. సాయం కోసం ఏదో ఒకటి చేస్తున్నారు. కానీ పవన్ నుంచి ఏ సాయం ప్రకటన ఇంకా రాలేదు. గుజరాత్ షూటింగ్ లో బిజీగా వున్నారు అనుకుంటే, మరి అప్పుడప్పుడు అక్కడి ఫోటోలు వదుల్తూనే వున్నారు. ఓ ప్రకటన లేదా ట్వీట్ చేయడం పెద్ద కష్టం కాదు.

ఇప్పుడు పవన్ హైదరాబాద్ కు వచ్చేసారు. ఆయన యూనిట్ కన్నా ముందుగా సోమవారమే నగరానికి చేరుకున్నారు. విలన్ పై కొన్ని షాట్లు వుండడంతో, యూనిట్ మరో రెండు రోజులు ఆలస్యంగా నగరానికి వస్తుంది. మరి నగరానికి చేరుకున్న పవన్ ఏమన్నా సాయం ఇప్పుడున్నా ప్రకటిస్తారో? మనకెందుకులే అని ఊరుకుంటారో? ఆయనకు చెన్నయ్ తో చిన్న నాటి అనుబంధం వుంది కదా?