మార్చేసారా..చేయనన్నాడా?

ఇండస్ట్రీలో కొన్ని సార్లు భలే చిత్రాలు జరుగుతుంటాయి.. మేమే వద్దనుకున్నాం అని వీళ్లంటే.. కాదు నేనే చేయనన్నాను అని వాళ్లు అంటుంటారు.ఇదో ఫాల్స్ ప్రెస్జీజీ వ్యవహారం. మా సినిమాను అతను కాదంటాడా.. అని వీళ్లు..…

ఇండస్ట్రీలో కొన్ని సార్లు భలే చిత్రాలు జరుగుతుంటాయి.. మేమే వద్దనుకున్నాం అని వీళ్లంటే.. కాదు నేనే చేయనన్నాను అని వాళ్లు అంటుంటారు.ఇదో ఫాల్స్ ప్రెస్జీజీ వ్యవహారం. మా సినిమాను అతను కాదంటాడా.. అని వీళ్లు.. నన్ను వద్దనుకున్నారా అని వాళ్లు ఇలా రివర్స్ లో చెబుతుంటారు. ఇప్పుడు రానా అండ్ కో, ప్రకాష్ రాజ్ వ్వవహారం ఇలాగే వుంది. రానా ఘాజీ సినిమాలో ప్రకాష్ రాజ్ ను రావు రమేష్ తో రీప్లేస్ చేసారు. 

దీనికి కారణం ప్రకాష్ రాజ్ తాము అనుకున్న టైమ్ కు డేట్ లు ఇవ్వలేదన్నాడని, తాము అంతవరకు ఆగలేకనే ఇలా చేసామని చెబుతున్నారట. అదేం కాదు. తాను  స్వంత సినిమా మా ఊరి రామాయణంలో బిజీగా వుండడం వల్ల తానే చేయనని అన్నానని ప్రకాష్ రాజ్ చెబుతున్నాడట. ఎవరి వెర్షన్ ను వాళ్లు గ్యాసిప్ లుగా  చలామణీ చేస్తున్నారు. 

ఏది ఏమైనా ప్రకాష్ రాజ్ టైమ్ కాస్త వెనక్కుతగ్గినట్లే కనిపిస్తోంది. కొత్తగా ట్రయ్ చేయాలే కానీ చాలా మంది పనికి వచ్చే వాళ్లు వున్నారు. మొన్నటికి మొన్న భలే భలే మగాడివోయ్ లో మురళీశర్మ మాదిరిగా.