ఆవిడ అందుకే పెళ్ళి చేసుకోలేదని పుకారు

గోల్డెన్‌ డేస్‌లో నటించిన హీరోయిన్స్‌ అంతగా గొప్పవాళ్ళే. తరతరాలూ చెప్పుకునే పేరు తెచ్చుకున్నారు. అలాంటి హీరోయిన్స్‌లో అప్పటి డ్రీమ్‌గర్ల్‌ కాంచన ఒకరు. బ్లాక్‌ అండ్‌ వైట్‌లో కూడా రిచ్‌గా, హైఫైలో కనిపించిన హీరోయిన్‌గా కాంచనకు…

గోల్డెన్‌ డేస్‌లో నటించిన హీరోయిన్స్‌ అంతగా గొప్పవాళ్ళే. తరతరాలూ చెప్పుకునే పేరు తెచ్చుకున్నారు. అలాంటి హీరోయిన్స్‌లో అప్పటి డ్రీమ్‌గర్ల్‌ కాంచన ఒకరు. బ్లాక్‌ అండ్‌ వైట్‌లో కూడా రిచ్‌గా, హైఫైలో కనిపించిన హీరోయిన్‌గా కాంచనకు ఎంతో పేరుంది. మంచి కుటుంబం, వీరాభిమన్యు, ధర్మదాత, ప్రేమించిచూడు, కళ్యాణమండపం, భక్తతుకారాం, దానవీర శూరకర్ణ లాంటి చిత్రాల్లో నటించి తన కీర్తి పతాకాన్ని ఎగురవేసిన కాంచన నిజజీవితంలో పెళ్ళి చేసుకోలేదు. 

ప్రస్తుతం ఆమె వయసు 76 సంవత్సరాలు. ప్రస్తుతం బెంగళూరులో ఓ స్వచ్ఛంద ఆశ్రమంలో కాలం వెల్లదీస్తున్న కాంచన, అప్పట్లో బాగా చదువుకున్న మహిళ. ఎయిర్‌హోస్టెస్‌గా పనిచేసి సినిమాల్లోకొచ్చిన మోడ్రన్‌ గర్ల్‌ కాంచన. ఆవిడ ఎందుకు పెళ్ళి చేసుకోలేదు? అంటే ఎన్నో కారణాలు చెబుతారుగానీ, ఆవిడ ప్రేమించిన వాడు మోసం చెయ్యడం లాంటివి ఏమీ జరగలేదట. 

తల్లిదండ్రులు కూడా ఇప్పుడే పెళ్ళి ఏంటి.? అంటూ గడిపెయ్యడం, కేవలం సంపాదించే యంత్రంలా కాంచనను చూడటం ఒక కారణం అయితే, కాంచన కూడా మగవాళ్ళను నమ్మేది కాదట. ఏ అలవాటూ లేనివాడు తనకు కనిపించలేదట. అలా అలా వయసు దాటిపోవడం, పెళ్ళి మీద విరక్తి కలగడం.. ఇవన్నీ ఆవిడను అవివాహితను చేశాయట. నేటికీ కాంచన బతికి వుండటం గొప్ప విషయం.