అనుకున్నామనీ జరగవు అన్నీ.. అనుకోలేదని ఆగవు కొన్ని.. ఎప్పుడు ఏది జరగాలో అది జరిగిపోతుంది. ఫలానా టైమ్‌లోనే ఎదగాలనుకుంటే మన చేతిలో ఏమీ వుండదని అంటోంది వయ్యారి భామ కాజల్ అగర్వాల్.
‘నేను సినిమా స్టార్‌ని అవుతానని అనుకోలేదు. మా పేరెంట్స్‌కి కూడా ఆ ఆలోచన లేదు. చక్కగా చదువుకుని ఉన్నతమైన ఉద్యోగాలు చేసుకుంటే చాలని అనుకున్నారు. అనుకోకుండా నేను మోడల్‌గా వుండటం, సినిమా హీరోయిన్ కావడం ఆటోమేటిక్‌గా జరిగిపోయాయి. ఏదీ బలవంతంగా అనుకుని సాధించలేదు. ఇక నటిగా నేను తగినంత స్కోర్ చేస్తాననే అనుకుంటున్నాను. నా వృత్తిని గౌరవించుకుంటూ ముందుకు సాగిపోతున్నాను.
నెంబర్ వన్ గేమ్ మీద నమ్మకం లేదు. నేను నా ట్రాక్‌లో అలుపు లేకుండా పరిగెడితే చాలు.. చాలామంది పెళ్ళి గురించి అడుగుతుంటారు. నేనేమీ పెళ్ళి కాకుండా సన్యాసినిలా అయితే వుండిపోను. నా కోసం ఒకడు పుట్టే వుంటాడు. అయితే టైమ్ రావాలి. నా రెమ్యునరేషన్ రీజనబుల్‌గానే వుంటుంది. నేను పెంచితే నిర్మాతలు ఎందుకు వస్తారు.? డిమాండ్‌ని బట్టే రేటు. ఇక నా డ్రీమ్ క్యారెక్టర్స్ అంటూ ఏం లేవు. ఏ పాత్ర చేసినా కష్టపడతాను అంతే..’ అంటూ మనసు విప్పింది కాజల్ అగర్వాల్.