జపాన్ లో పోర్నోగ్రఫీ సినిమాల లీలలు!

మన దేశంలో పోర్నోగ్రఫీ సినిమాలు అధికారికంగా నిషేధం. అయితే ఇంటర్నెట్ లో అలాంటి సినిమాల సైట్లకు కొదవలేదు. ఎలాంటి పరిమితులూ లేకుండా లభ్యం అవుతున్నాయి. తరచూ ఈ అంశం గురించి పార్లమెంటులో కూడా చర్చ…

మన దేశంలో పోర్నోగ్రఫీ సినిమాలు అధికారికంగా నిషేధం. అయితే ఇంటర్నెట్ లో అలాంటి సినిమాల సైట్లకు కొదవలేదు. ఎలాంటి పరిమితులూ లేకుండా లభ్యం అవుతున్నాయి. తరచూ ఈ అంశం గురించి పార్లమెంటులో కూడా చర్చ జరుగుతోంది. 

మనదేశం ఆవలకు వెళితే.. చాలాదేశాల్లో పోర్న్ పై ఎలాంటి నిషేధమూ లేదు. కొంత వయసు వచ్చాకా యువతీయువకులు పోర్న్ సినిమాలు చూడటానికి అయినా.. వాటిల్లో నటించడానికి అయినా అర్హత పొందుతారు. చాలా దేశాల్లో అదో పెద్ద ఇండస్ట్రీ!

మరి ప్రపంచంలోని మిగతా దేశాల పోర్న్ పరిశ్రమల కథలు ఎలా ఉన్నా.. జపాన్ మాత్రం ఈ విషయంలో చాలా వెరైటీ. ఎక్కడైనా పోర్న్ ఇండస్ట్రీలో కాస్త యుక్త వయసులో ఉన్నవారికి.. మహా అంటే కొంత వయసులో ఉన్నవారికీ క్రేజ్ ఉంటుంది. ఉదాహరణకు సన్నీలియోన్. అయితే జపాన్ పోర్న్ ఇండస్ట్రీ మాత్రం 60 యేళ్ల పై బడ్డ వారితో వెలిగిపోతోంది!

యుక్తవయసు వారు నటించిన పోర్న్ కూ గిరాకీ ఉంది కానీ.. అక్కడ ముసలివాళ్ల ముచ్చట్లు 'సిల్వర్ పోర్న్' గా  ఫేమస్. 60 నుంచి 70 యేళ్ల వయసు వారు వీటిల్లోనటిస్తూ ఉంటారు. ఎలాగూ వీటిపై నిషేధమేదీ లేదు కాబట్టి.. అధికారికంగా వీటి ప్రకటనలు జరిగిపోతూ ఉంటాయి. తాజాగా ఫోటోలోని యాసూ టొమిటా అనే ఈ 61 యేళ్ల వయసు మహిళ పోర్న్ సినిమా ఆరంగ్రేటం చేసింది. ట్రయల్ పార్ట్ గా ఫోటో షూట్ లో పాల్గొంది. మరి ఇంత వయసు వచ్చాకా.. పోర్న్ ఏమిటి? అంటే.. వయసు మీదపడితే మాత్రం మనుషులం కాకుండాపోతామా?!  అనే లాజికల్ కొశ్చన్ పడుతుంది!