బన్నీని ఢీకొంటున్న ఆది

ఆది అంటే..ఆది పినిశెట్టి…మన జనాలకు హీరోగా కొన్ని సినిమాలతో పరిచయం. కానీ బోయపాటి శ్రీను వున్నాడు చూసారూ…ఫ్యామిలీ హీరోగా వున్న జగపతి బాబును తీసుకెళ్లి విలన్ ను చేసేసాడు. ఇప్పుడు ఈ ఆది పినిశెట్టిని…

ఆది అంటే..ఆది పినిశెట్టి…మన జనాలకు హీరోగా కొన్ని సినిమాలతో పరిచయం. కానీ బోయపాటి శ్రీను వున్నాడు చూసారూ…ఫ్యామిలీ హీరోగా వున్న జగపతి బాబును తీసుకెళ్లి విలన్ ను చేసేసాడు. ఇప్పుడు ఈ ఆది పినిశెట్టిని కూడా అదే బాటలోకి తీసుకెళ్లిపోయాడు. బన్నీతో గీతా ఆర్ట్స్ నిర్మిస్తున్న సినిమాకు ఆది ని విలన్ గా పరిచయం చేస్తున్నాడు. 

యంగ్ హీరోకి యంగ్ విలన్ వుంటే బాగుంటుంది. అందరికీ ప్రకాష్ రాజ్ విలన్ అంటే బోర్ కోట్టేస్తోంది. ఇటీవల ఈ ట్రెండ్ మారింది. అందుకే కొత్త కొత్త విలన్లు తెరపైకి వస్తున్నారు. 

ఈ బోణీ బాగుంటే ఆది కూడా తన కెరీర్ ను మలుపుతిప్పేసుకుంటాడు. పైగా ఆది విలన్ కావడం సినిమాకు ప్లస్ కూడా. ఎందుకంటే ఆదికి తమిళనాట మార్కెట్ వుంది కదా.