సాధారణంగా నిర్మాణ సంస్థలు పీఆర్వోల ద్వారా కీలక విషయాలు వెల్లడిస్తుంటాయి. అది కూడా అధికారికంగా. అయితే ఈ మధ్య కొత్త రూటు కనిపెట్టారు. తమకు సందేహం వున్నవి, చెబితే రెస్పాన్స్ ఎలా వుంటుందో తెలుసుకోవాలనుకుంటున్న విషయాలు, ఇలా నోట్ గా చెప్పకుండా, పీఆర్వోలతోనో, లేదా వేరేకరితోనో నోటితో చెప్పిస్తున్నాయట. అంటే ఫలానా విషయం..ట. అంటారు. అది నెట్ లో వచ్చిన తరువాత రెస్పాన్స్ పాజిటివ్ అయితే ఓకె. లేదూ నెగిటివ్ అయితే, అబ్బే మాకేం తెలియదు అని అధికారికంగా ఖండిస్తారు. అదన్నమాట. ఇటీవల గబ్బర్ సింగ్ 2 పేరు ను సర్దార్ అని మారుస్తున్నట్లు అలాగే లీకులు ఇచ్చారు. తాము చెప్పినట్లు కాకుండా మీకు తెలిసినట్లు రాసుకోండి అంటూ కొంతమందికి ఒకరు. మరి కొంతమందికి ఇంకొకరు లీకులు ఇచ్చారు. ఇప్పుడు సర్దార్ టైటిల్ బాగానే వుంది కాబట్టి, ఇంక ఎప్పుడో అఫిషియల్ గా ప్రకటించేస్తారు. అవును..ఇంతకీ సర్దార్ గౌతు లచ్చన్న అభిమానులు ఏమంటారో? ఆయన కొడుకు శివాజీ తెలుగుదేశంలో వున్నారు కాబట్టి, మన పవన్ బాబు సినిమా కాబట్టి ఏమీ అభ్యంతరం వుండకపోవచ్చు.