ఫ్రం మహేష్ టు వరుణ్ వయా క్రిష్

ఓ కథ అద్భుతంగా రూపొందిన తరువాత ఎవరికి దక్కుతుందో చెప్పలేం. ఎక్కడెక్కడో తిరిగి తిరిగి ఎక్కడికో చేరుతుంది. ఎవరికో హిట్ ఇస్తుంది. ఇలాంటి వ్యవహారాలు గతంలో టాలీవుడ్ లో చాలా వున్నాయి. గీతాంజలి కథ…

ఓ కథ అద్భుతంగా రూపొందిన తరువాత ఎవరికి దక్కుతుందో చెప్పలేం. ఎక్కడెక్కడో తిరిగి తిరిగి ఎక్కడికో చేరుతుంది. ఎవరికో హిట్ ఇస్తుంది. ఇలాంటి వ్యవహారాలు గతంలో టాలీవుడ్ లో చాలా వున్నాయి. గీతాంజలి కథ ఎందరి దగ్గరకో తిరిగింది. ఏమాయ చేసావే కూడా అంతే. ఇలా ఇంకా చాలా వున్నాయి. 

ఇప్పుడు ఇందుకు తాజా ఎగ్జాంపుల్..దర్శకుడు క్రిష్ తయారు చేసుకున్న శివం కథ. ఈ కథ మహేష్ కు వినిపించాడు ముందు. చూద్దాం అన్నాడు మహేష్. ఈ లోగా ఇటు ఈక్వేషన్లు, అటు పరిస్థితులు మారాయి.  క్రిష్ కన్నా మహేష్ దగ్గర ముందుగా లైన్ లో చాలా మంది చేరారు. 

దీంతో క్రిష్ ఇప్పుడు మెగా న్యూ హీరో వరుణ్ తేజ దగ్గరకు చేరాడు. అదే కథ వినిపించాడని..వాళ్లంతా సూపరెహె..అన్నారని టాక్. ఇప్పుడు ఆ కథే వరుణ్ తేజ తో రెడీఅవుతుందని వినికిడి. ఎవరికి ఏది ప్రాప్తమో..చెప్పలేం కదా.