అనుష్క, విరాట్‌ గురించే డిస్కషన్‌

విరాట్‌ కోహ్లీ, అనుష్క.. ఈ ప్రేమ జంట గురించి ఇండియాలోనే కాదు, ఆస్ట్రేలియానూ ‘డిస్కషన్‌’ జరుగుతోంది. కారణం అందరికీ తెల్సిందే. క్రికెటర్లు గర్ల్‌ఫ్రెండ్స్‌ని మెయిన్‌టెయిన్‌ చేయడం ఆస్ట్రేలియాలో వింతేమీ కాదు. ఆసీస్‌ క్రికెట్‌లో లవర్‌…

విరాట్‌ కోహ్లీ, అనుష్క.. ఈ ప్రేమ జంట గురించి ఇండియాలోనే కాదు, ఆస్ట్రేలియానూ ‘డిస్కషన్‌’ జరుగుతోంది. కారణం అందరికీ తెల్సిందే. క్రికెటర్లు గర్ల్‌ఫ్రెండ్స్‌ని మెయిన్‌టెయిన్‌ చేయడం ఆస్ట్రేలియాలో వింతేమీ కాదు. ఆసీస్‌ క్రికెట్‌లో లవర్‌ బోయ్‌ అంటే షేన్‌ వార్న్‌. క్రికెట్‌లో అతను సాధించిన విజయాలతో వచ్చిన పాపులారిటీకన్నా రెండిరతలు గర్ల్‌ఫ్రెండ్స్‌ కారణంగా అతనికి వచ్చిందనడం అతిశయోక్తి కాదేమో.

ఇక, టీమిండియా మూడో టెస్ట్‌లో బ్యాటింగ్‌ చేస్తున్నప్పుడు.. అందునా కోహ్లీ బ్యాటింగ్‌ దుమ్మురేపేస్తోన్నప్పుడు (తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన సమయంలో) కామెంటేటర్‌, గ్యాలరీల్లో వున్న అనుష్కని ఉద్దేశించి ‘కోహ్లీ భార్య..’ అని సంబోదించాడు. దాంతో ఒక్కసారిగా అంతా షాక్‌ అయ్యారు. తేరుకున్న కామెంటేటర్‌, ‘ఫియాన్సీ’ అని సవరించుకున్నాడు తన డైలాగ్‌ని. మరోపక్క, కోహ్లీ సెంచరీ చేసి, అనుష్క శర్మ వైపు బ్యాట్‌ని చూపిస్తూ ఫ్లయ్యింగ్‌ కిస్‌ ఇచ్చిన విషయం విదితమే.

కామెంటేటర్‌ కోహ్లీ భార్య అనడం.. మ్యాచ్‌ ఫొటోల్లో అనుష్కకి విరాట్‌ ఫ్లయ్యింగ్‌ కిస్‌ ఇస్తున్నట్లు వుండడం.. ఇవన్నీ ఆసీస్‌ మీడియాకి బోల్డంత మేటర్‌ని ఇచ్చేశాయి. ఇంకేముంది.. విరాట్‌, కోహ్లీ ఎఫైర్‌ గురించి కథనాల మీద కథనాలు ఆసీస్‌ మీడియాలో వెల్లువెత్తేస్తున్నాయి.