మళ్లీ ఈరోస్ నేనా?

మన తెలుగు సినిమాకు కార్పొరేట్ సంస్థలు అంతగా అచ్చిరాలేదు. యుటివీ, ఈరోస్ సంస్థలు ఫైనాన్స్ చేసిన సినిమాలు ఏవీ ఆడిన దాఖలాలు లేవు. ఇప్పటికి ఈరోస్ తెలుగులో ఆగడు, వన్ సినిమాలు అందించారు. రెండూ…

మన తెలుగు సినిమాకు కార్పొరేట్ సంస్థలు అంతగా అచ్చిరాలేదు. యుటివీ, ఈరోస్ సంస్థలు ఫైనాన్స్ చేసిన సినిమాలు ఏవీ ఆడిన దాఖలాలు లేవు. ఇప్పటికి ఈరోస్ తెలుగులో ఆగడు, వన్ సినిమాలు అందించారు. రెండూ డిజాస్టర్లే. తమిళనాట మణిరత్నం విలన్,  లింగా, కొచ్చడియాన్ ల ఫలితం తెలిసిందే.  ఇప్పుడు పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ 2 ను 63 కోట్లకు తీసుకున్నారని ఈ రోజు వార్తలు వెలువడ్డాయి. 

దీంతో పవన్ అభిమానులకు ఆనందించాలో , కలవరపడాలో తెలియడం లేదు. అంత పెద్ద మొత్తం ఆఫర్ అంటే ఆనందమే. ఎంత రిచ్ గా తీసినా నలభై కోట్ల నుంచి యాభై కోట్లకు దాటదు. అంటే 13 నుంచి ఇరవై కోట్ల లాభం. పవన్ ఆంతరంగికుడు శరద్ మురార్ కు. అంటే పవన్ రెమ్యూనిరేషన్ లాభాల్లో వాటా కలిపి ఇరవై కోట్ల దాకా వుంటుంది. ఇదంతా పాజిటివ్ వైబ్రేషన్. 

కానీ ఈరోస్ సంస్థ సౌత్ లో అందించిన డిజాస్టర్లను తలుచుకుంటే, నెగిటివ్ వైబ్రేషన్లు కలుగుతున్నాయి. పైగా దర్శకుడు బాబికి ఇది రెండో సినిమా. టాలీవుడ్ లో ఇదో భయంకరమైన సెంటిమెంట్. ఈ వైతరిణిని దాటిని వారి సంఖ్య చాలా ..చాలా..తక్కువ. ఇదిలా వుంటే ఇంకో భయం కూడా వుంది. తెలుగులో హిట్ అయిన సీక్వెల్ అన్నది లేదు. అది కూడా ఓ శంక. గబ్బర్ సింగ్ 2 ఈ ఏంటీ సెంటిమెంట్లను అన్నింటినీ అధిగమించి హిట్ కావాలన్నదే అభిమానుల కోరిక.