మనవాళ్లకు ఓ స్టాండర్డ్ డైలాగు వుందని ఓ విమర్శవుంది. అన్నీ వేదాల్లోనే ఉన్నాయష…అని ఓ పెద్దాయిన వెక్కిరింతగా అన్నాడు కూడా. డైరక్టర్ రాజమౌళి దగ్గర కూడా ఇలాంటి స్టాక్ డైలాగు ఒకటి వుంది. ఏదయినా సరే, ఇది మా నాన్న రాసింది. ఆయన ఎప్పుడో రాసారు అని. మగధీర కథలాంటి సీరియల్ ఓ వారపత్రికలో వచ్చాక కూడా, అది మాకు తెలియదు..మానాన్న ఎప్పుడో రాసారు అన్నారు.
అలాగే ఇంకా చాలా..చాలా..ఇప్పుడు తాజగా శాంభవి ఐపీఎస్ , విక్రమార్కుడు సంగతి. మా నాన్న ఎప్పుడో రాసారు. అది శాంభవి ఐపీఎస్ చిత్రంలోకి ఎలా వెళ్లిందో అంటున్నారు. తమిళనాట నాడీ జ్యొతిష గ్రంధాల్లా, వేదాల్లా, రాజమౌళి డాడీ రచనల్లో ప్రపంచ సినిమాలు అన్నీ వున్నట్లున్నాయి అంటున్నారు కిట్టని వాళ్లు పాపం.