ఆ రాజుగారి మరణంతో 30మంది మహిళలకు వైధవ్యం!

శుక్రవారం మరణించిన సౌదీ రాజు అబ్దుల్లా బిన్ అబ్ధుల్ అజీజ్ అల్ సౌద్ కు ఇస్లాం ప్రపంచంలో రీఫార్మర్ గా పేరు. ఈయనది సంస్కర్త హృదయం అని కొంతమంది చెబుతూ ఉంటారు. అయితే ఈ…

శుక్రవారం మరణించిన సౌదీ రాజు అబ్దుల్లా బిన్ అబ్ధుల్ అజీజ్ అల్ సౌద్ కు ఇస్లాం ప్రపంచంలో రీఫార్మర్ గా పేరు. ఈయనది సంస్కర్త హృదయం అని కొంతమంది చెబుతూ ఉంటారు. అయితే ఈ రాజుగారు పేరుకు రీఫార్మారే కానీ.. అసలు వ్యవహారాల్లో మాత్రం పరమ సంప్రదాయవాది. దీనికి అనేక సాక్షాలు కనిపిస్తున్నాయి. 

రాజుగారి మరణంతో 30 మంది భార్యలు వైధవ్యాన్ని పొందుతున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అంతమందిని వివాహం చేసుకొన్న ఘనుడు ఈ రాజుగారు. అయితే అఫిషియల్ గా గుర్తింపు ఉన్నది మాత్రం 11 మంది భార్యలకే. వీరిలో ఇద్దరికేమో తలాక్ చెప్పాడు. చివరకు తొమ్మిది మంది భార్యలు మాత్రం అంతఃపుర కాంతలుగా ఉన్నారు.

ఇక రాజుగారి సంస్కర్త హృదయం ఎలాంటిది అంటే..  ఈయన తమదేశంలో మహిళలు డ్రైవింగ్ చేయడానికి వీల్లేదు అని చట్టం కూడా తెచ్చాడు. మహిళలను ఎంతగా కట్టడి చేయవచ్చునో.. అన్ని మార్గాలనూ దాటి వచ్చి డ్రైవింగ్ విషయంలో కూడా వారికి అవకాశం లేకుండా చేసిన ఘనత ఈ రాజుగారిది.

అలాగే నాస్తికులకు మరణమే తగిన శిక్ష అనేది రాజుగారి నినాదం. అల్లాను నమ్మని వాడికి బతికే అర్హత కూడా లేదని ఈయన చెప్పుకొచ్చేవారు. 90 యేళ్ల వయసులో ఈయన మరణిస్తే గొప్ప సంస్కర్త చనిపోయాడని కొంతమంది అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈయనను సంస్కర్త అని అనడమే తప్పనే అభిప్రాయాలను కలగలచేసే వ్యవహారాలివి.

ఈ రాజుగారి తండ్రిగారికి మొత్తం 22 వివాహాలు. వారిలో ఆరో భార్యకు పుట్టిన వ్యక్తి ఈయన. అయితే అధిరికారికంగా ఈయన చేసుకొన్నది 11 వివాహాలే కాబట్టి.. భార్యల సంఖ్య సగానికి తగ్గించాడు కాబట్టి.. ఈయనను సంస్కర్త అనొచ్చునేమో!