సాములోరికి ఊరట

కంచి స్వాములకు ఊరట లభించింది. 2004లో కాంచీపురంలోని వరదరాజు పెరుమాళ్‌ ఆలయం మేనేజర్‌ శంకర్‌రామన్‌, ఆలయ ప్రాంగణంలోనే దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించి, కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి, విజయేంద్ర…

కంచి స్వాములకు ఊరట లభించింది. 2004లో కాంచీపురంలోని వరదరాజు పెరుమాళ్‌ ఆలయం మేనేజర్‌ శంకర్‌రామన్‌, ఆలయ ప్రాంగణంలోనే దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించి, కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి, విజయేంద్ర సరస్వతి సహా, పలువురిపై ఆరోపణలు వచ్చాయి.

ఏళ్ళ తరబడి ఈ కేసు విచారణ సుదీర్ఘంగా సాగింది. ఈరోజు ఈ కేసులో కీలక తీర్పు వెల్లడించింది పాండిచ్చేరి న్యాయస్థానం. 189 మంది సాక్షులను విచారించిన న్యాయస్థానం ఆరోపణలు ఎదుర్కొంటోన్న కంచి పీఠాధిపతులు నిర్దోషులుగా తేల్చింది. దాంతో, జయేంద్ర సరస్వతి, విజయేంద్ర సర్వస్వతిలకు ఊరట లభించినట్లే. మొత్తం 24 మంది ఈ కేసులో నిర్దోషులుగా తేలారు. 

హత్యకేసును ఛేదించే క్రమంలో ఉద్దేశ్యపూర్వకంగా జయేంద్ర సరస్వతి చుట్టూ అభియోగాలు మోపబడ్డాయని, కేసు విచారణ జరగాల్సిన కోణంలో జరగలేదని న్యాయస్థానం అభిప్రాయపడింది.