రజనీ కంటే పవన్‌ పాపులరా?

ఒక ప్రముఖ పత్రిక నిర్వహించిన పాపులర్‌ హీరోల పోల్‌లో పవన్‌కళ్యాణ్‌, మహేష్‌బాబు టాప్‌ 10లో చోటు దక్కించుకున్నారని ఓ వార్త ప్రచారంలో ఉంది. వీరిద్దరికీ టాప్‌ 10లో చోటు దక్కడంలో విశేషం ఏమీ లేదు…

ఒక ప్రముఖ పత్రిక నిర్వహించిన పాపులర్‌ హీరోల పోల్‌లో పవన్‌కళ్యాణ్‌, మహేష్‌బాబు టాప్‌ 10లో చోటు దక్కించుకున్నారని ఓ వార్త ప్రచారంలో ఉంది. వీరిద్దరికీ టాప్‌ 10లో చోటు దక్కడంలో విశేషం ఏమీ లేదు కానీ ఈ జాబితాలో వీళ్లిద్దరు మాత్రమే దక్షిణాది హీరోలు. మిగతా ఎవరికీ ఈ లిస్టులో చోటు దక్కలేదు. పవన్‌కి ఆరో స్థానం, మహేష్‌కి పదో స్థానం దక్కాయట. 

ఇదేదో మెగా రిగ్గింగ్‌లా అనిపిస్తోంది కదూ? లేదంటే దక్షిణాది హీరోలని కన్సిడర్‌ చేసినట్టయితే ఆలిండియా సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌కి టాప్‌ 10లో చోటు దక్కకపోవడం ఏమిటి… చిత్రం కాకపోతే. పోనీ యువకులని మాత్రమే లెక్క లోకి తీసుకున్నారా అంటే అదీ లేదు. ఈ లిస్ట్‌లో అమితాబ్‌ కూడా ఉన్నాడు. అమితాబ్‌ కంటే కూడా పవన్‌ పాపులర్‌ అని సర్వే సారాంశం. 

రెండు బ్లాక్‌బస్టర్స్‌ రాగానే పవన్‌ని మరీ ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఫేక్‌ సర్వేలతో పాపులర్‌ సౌత్‌ హీరో అతనేనని చూపించే ప్రయత్నం చేస్తున్నారు. పవన్‌కి పర్సనల్‌గా ఇలాంటివి నచ్చకపోయినా కానీ ప్రస్తుతం అతను బూమ్‌లో ఉన్నాడు కాబట్టి దానిని క్యాష్‌ చేసుకోడానికి ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారిలా.