తాప్సి పేరు చెబితేనే దర్శకులు, హీరోలూ భయపడిపోతున్నారు. ఆమెకున్న ఐరెన్ లెగ్ బ్రాండ్ అలాంటిది. చేసిన ప్రతి సినిమా ఫట్టే. ఒకవేళ సినిమా బాగున్నా వసూళ్లు మాత్రం దక్కవు. అందుకే తాప్సిని ఎంచుకొని రిస్క్ చేయలేకపోతున్నారు సినిమావాళ్లు.
తాజాగా మహేష్ బాబు ఆగడు సినిమాలో ఆమెకు అవకాశం అందినట్టే అంది చేజారిపోయింది. ఈ సినిమాలో ఇద్దరు కథానాయికలున్నారు. ఒక నాయికగా తమన్నా ఎంపిక జరిగిపోయింది. రెండో నాయికగా తాప్సిని ఎంచుకొందాం అనుకొన్నారు. సంప్రదింపులు కూడా జరిగాయి.
కానీ సడన్ గా ఈ ప్రయత్నం నుంచి డ్రాప్ అయ్యారు. తాప్సి వద్దు… అని మహేష్ చెప్పడం వల్లే ఈ సినిమాలో తాప్సికి అవకాశం దక్కకుండా పోయిందట. తాప్సి అయిరన్ లెగ్ అన్న విషయం ప్రిన్స్‌కీ తెలిసిపోయిందన్నమాట. పాపం… తాప్సి? ఈ నింద నుంచి ఎలా బయటపడుతుందో ఏమో..?