స్టార్ హీరోలకి సినిమాల్లో వచ్చే రెమ్యునరేషన్‌తోపాటుగా, బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించినందుకుగాను పెద్ద మొత్తంలో ‘కాసుల పంట’ పండుతుండడం చూస్తూనే వున్నాం. తెలుగు హీరోల్లో మహేష్, రెండో సంపాదన విషయంలో టాప్ ప్లేస్‌లో వున్నాడన్నది అందరికీ తెల్సిన విషయమే. నాగార్జున, వెంకటేష్, అల్లు అర్జున్ కూడా వివిధ ప్రోడక్ట్స్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు.
ఒకప్పుడు పవన్‌కళ్యాణ్ పెప్సీ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించేవాడు. చిరంజీవి థమ్సప్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేసి, అప్పట్లో ఆ టైపు సంపాదన పరంగా టాప్ ఛెయిర్‌లో కూర్చున్నారు. తాజాగా పవన్ వెంట పలు సంస్థలు తిరుగుతున్నాయట, తమ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేయమని కోరుతూ.
భారీ మొత్తాల్లో ఆఫర్స్ ఇస్తూ పవన్ వెంట వారు తిరుగుతున్నా, పవన్ నుంచి ఎలాంటి సానుకూల స్పందనా రావడంలేదనే ప్రచారం జరుగుతోంది. గతంలో పెప్సీ సంస్థకి ఓకే చెప్పిన పవన్, ఇప్పుడెందుకు అలాంటి వ్యవహారాల జోలికి వెళ్ళడంలేదో ఎవరికీ అర్థం కావడంలేదు.
ఒకవేళ పవన్ ఏదన్నా బ్రాండ్‌కి ఓకే చెబితే, ఆ రంగంలో అత్యధికంగా పారితోషికం తీసుకునే వ్యక్తిగా పవన్ సరికొత్త రికార్డులు సృష్టిస్తాడని పవన్ అభిమానులు అంటున్నారు. ఓ సినిమా వసూళ్ళను బట్టి ఆ హీరో రేంజ్ ఎలాగైతే పెరుగుతుందో, బ్రాండ్ అంబాసిడర్‌గా దక్కే రెమ్యునరేషన్, ఆ రంగంలో వున్న డిమాండ్‌ని బట్టి కూడా రేంజ్‌ని డిసైడ్ చేస్తున్న రోజులివి.
మరి, పవన్ తన రేంజ్ చాటుకునేందుకు ప్రయత్నిస్తాడా.? లేదంటే ఈ రంగానికి దూరంగా వుండాలనే పవన్ కోరుకుంటాడా.? ఏమో మరి, మరికొద్ది రోజులు ఆగితే తెలుస్తుంది.