గుర్రం ఎగుర్తుందా మరి?

కెరీర్‌ స్టార్ట్‌ చేసిన కొత్తల్లో హిట్‌ అవడానికి చాలా కష్టపడ్డ సుమంత్‌కి సత్యం, గౌరి, గోదావరి టైమ్‌లో కాస్త ఉపశమనం దక్కింది. హీరోగా నిలదొక్కుకున్నట్టే అనుకుంటున్న టైమ్‌లోనే మళ్లీ ఫ్లాపుల బాట పట్టాడు. వరుస…

కెరీర్‌ స్టార్ట్‌ చేసిన కొత్తల్లో హిట్‌ అవడానికి చాలా కష్టపడ్డ సుమంత్‌కి సత్యం, గౌరి, గోదావరి టైమ్‌లో కాస్త ఉపశమనం దక్కింది. హీరోగా నిలదొక్కుకున్నట్టే అనుకుంటున్న టైమ్‌లోనే మళ్లీ ఫ్లాపుల బాట పట్టాడు. వరుస పరాజయాలకి తోడు నాగచైతన్య ఆగమనంతో అక్కినేని అభిమానులు కూడా సుమంత్‌ సినిమాలపై ఆసక్తి తగ్గించేశారు. 

దాంతో సుమంత్‌ చిత్రాలకి కనీసం చెప్పుకోతగ్గ ఓపెనింగ్స్‌ కూడా రావట్లేదిప్పుడు. ఈ నేపథ్యంలో చాలా గ్యాప్‌ తర్వాత అతను ‘ఏమో గుర్రం ఎగరావచ్చు’ అనే సినిమా చేస్తున్నాడు? ఈ సినిమా హిట్‌ అయి సుమంత్‌కి మళ్లీ హీరోగా బ్రేక్‌ వస్తుందా? ‘ఆ నలుగురు’, ‘అందరి బంధువయా’లాంటి చిత్రాలతో దర్శకుడిగా తనదైన ముద్ర వేసిన చంద్రసిద్ధార్థ్‌ ఈ చిత్రంతో సుమంత్‌కి హిట్టిస్తాడా?

గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘మధుమాసం’ అంతంతమాత్రంగానే ఆడిరది. ప్రస్తుతం ఈ సినిమాపై ఎవరికీ ఎలాంటి అంచనాలు లేవు. కానీ టైటిల్‌ సూచిస్తున్నట్టు… ఏమో గుర్రం ఎగరినా ఎగరొచ్చు! సుమంత్‌కి ఇన్నేళ్ల తర్వాత ఇంకో హిట్‌ కూడా రావచ్చు.