ఊరూవాడా అంబరాన్నంటేలా బోగిపండగ

సంక్రాంతి షురూ అయ్యింది. తొలి పండుగ భోగి కావడంతో.. ఊరూ వాడా బోగి మంటలతో సందడి చేస్తున్నాయి. బోగి అంటేనే పిల్లల పండుగ.. కొత్త బట్టలతో బోగి పిడకలతో బోగి మంటల వైపు పరుగులు…

సంక్రాంతి షురూ అయ్యింది. తొలి పండుగ భోగి కావడంతో.. ఊరూ వాడా బోగి మంటలతో సందడి చేస్తున్నాయి. బోగి అంటేనే పిల్లల పండుగ.. కొత్త బట్టలతో బోగి పిడకలతో బోగి మంటల వైపు పరుగులు తీశారు పొద్దున్నే చిన్న పిల్లలంతా. గంగిరెద్దులు హరిదాసుల సందడి గురించి ఎంత చెప్పుకున్న తక్కువే.  బోగి మంటల్లో చలి కాచుకోవడం ఓ కొత్త అనుభూతి.

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భోగి పండుగ సంబరాలు అంబరాన్నంటేలా జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వమే సంక్రాంతి పండుగను నిర్వహిస్తున్న దరిమిలా, ప్రత్యేకమైన సందడి నెలకొంది అక్కడ. శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా.. అన్ని జిల్లాల్లోనూ ఒకటే సందడి వాతావరణం. రాజకీయ నాయకుల సందడితో బోగి పండకు మరింత కళ వచ్చిందనే చెప్పాలి.

ఇక, ఉభయగోదావరి జిల్లాల్లో సంక్రాంతి స్పెషల్‌ అయిన కోడి పందాలు బీభత్సంగా కొనసాగుతున్నాయి. పోలీసుల హెచ్చరికలు ఓ పక్క వున్నా, ఇంకోపక్క రాజకీయ నాయకుల ప్రమేయంతో కోడి పందాలు ఎడా పెడా జరుగుతున్నాయి. లక్షల్లో కోడి పందాలు జరుగుతున్నాయంటే అతిశయోక్తి కాదేమో. మరోపక్క, పండగ వేళ పిండి వంటలతో అతివలు ఘుమఘుమలాడిరచేస్తున్నారు.