హీరోయిన్‌గా ఓ మోస్తరు గుర్తింపు తెచ్చుకున్న అమలాపాల్, కెరీర్‌ని తొందరగానే ముగించేసుకుంది. అయితే మళ్ళీ సినిమాల్లో నటించాలనే ఆశతో రీ`ఎంట్రీకి రెడీ అవుతోంది అమలా పాల్. ఇటీవలే ప్రేమించి, పెద్దల్ని ఒప్పించి పెళ్ళి చేసుకున్న అమలాపాల్, తిరిగి సినిమాల్లో నటించాలన్న ఆలోచనతో తన పాత పరిచయాల్ని తిరగతోడుతోంది.
అయితే అమలాపాల్ ప్రెగ్నెంట్ అనే ఓ గాసిప్ బయటకు రావడంతో అమలాపాల్‌కి అవకాశాలు ఇవ్వడానికి ఎవరూ ముందుకు రావడంలేదు. ఈ విషయం తన దృష్టికి వచ్చేసరికి తెగ ఇదయిపోయిన అమలాపాల్, తాను గర్భవతిని కాననీ, సినిమాల్లో నటించడానికి తాను రెడీగా వున్నానని వివరణ ఇచ్చుకుంది.
‘నాన్న’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అమలాపాల్ స్ట్రెయిట్‌గా తెలుగులో చేసిన తొలి సినిమా ‘బెజవాడ’. ఆ తర్వాత రామ్‌చరణ్‌తో ‘నాయక్’ సినిమాలో అమలాపాల్ నటించిన విషయం విదితమే. రీ`ఎంట్రీలో అమలాపాల్ తెలుగు సినిమాలపైనే ఫోకస్ పెట్టిందట. కానీ, టాలీవుడ్‌లో హీరోయిన్‌గా రాణించాలంటే, అది పెళ్ళయ్యాక కష్టమే కదా మరి.!