మాటెత్తితే దేశం కోసం.. ధర్మం కోసం.. అవినీతి రహిత పాలన కోసం! గత పన్నెండేళ్లుగా బీజేపీ రాజకీయ ప్రచారంలో పదేపదే వినిపిస్తున్న మాటలివి.
రాజకీయాల్లో కొత్త ప్రమాణాలు నెలకొల్పేది తామేనని ఆ పార్టీ చెప్పుకుంటుంది. కానీ ఆచరణలో కనిపించే కొన్ని ఘటనలు మాత్రం ఈ గొప్ప మాటలకే పరీక్ష పెడుతున్నాయి. తాజాగా గుజరాత్‌లో యూసుఫ్ పఠాన్‌కు సంబంధించిన భూమి వివాదం కూడా అలాంటి ప్రశ్నలనే లేవనెత్తుతోంది.
క్రికెట్ మైదానంలో సిక్సర్లతో అభిమానులను అలరించిన యూసుఫ్ పఠాన్ ఆ మధ్య రాజకీయాల్లోకి రావడం, బెంగాల్ లో టీఎంసీ తరఫున ఎంపీగా నెగ్గడం, ఈ మధ్య ఆయన టీఎంసీకి దూరం కావడం తెలిసిన సంగతులే!
ఇప్పుడు వడోదరలో వివాదాస్పద స్థలంలో కొంత భాగాన్ని ఆయనకు కేటాయిస్తుండటం వివాదస్పందంగా మారింది! 978 చదరపు మీటర్ల భూమి, విలువ సుమారు రూ.20.53 కోట్లు.
ఇందులో 500 చదరపు మీటర్లను ఉచితంగా, మిగిలిన 478 చదరపు మీటర్లను నిర్ణయించిన మార్కెట్ విలువలో 55 శాతానికి కేటాయించే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఈ రాయితీ విలువ దాదాపు రూ.15 కోట్లు.
కేటాయించడమే కాదు, ఈ వ్యవహారం పూర్వాపరాలు మరింత ఆసక్తికరం! 2014లో గుజరాత్ ప్రభుత్వం బహిరంగ వేలం లేకుండా భూమిని బదిలీ చేయలేమనే కారణంతో ఇదే కేటాయింపును తిరస్కరించింది.
2024లో వడోదర మున్సిపల్ కార్పొరేషన్ ఆక్రమణ తొలగింపునకు నోటీసు ఇచ్చింది. 2025లో గుజరాత్ హైకోర్టు కూడా చట్టబద్ధమైన కేటాయింపు లేకుండా భూమిపై హక్కు ఏర్పడదని స్పష్టం చేసింది. అయితే ఇప్పుడు కథ మొత్తం మారిపోయింది!
యూసుఫ్ పఠాన్ రాజకీయ ప్రయాణం ఈ వివాదానికి మరింత ప్రాధాన్యం తెచ్చింది. ఆయన తృణమూల్ కాంగ్రెస్ తరఫున ఎంపీగా ఎన్నికయ్యారు. అనంతరం ఆ పార్టీకి దూరమై ఎన్డీఏ వైపు రాజకీయంగా అడుగులు వేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో భూమి కేటాయింపు అంశం వెలుగులోకి రావడంతో రాజకీయ విమర్శలు మొదలయ్యాయి.
అయితే పార్టీ మారినందుకే ఈ రాయితీ ఇచ్చారనేది దుర్మార్గుల, దేశ ద్రోహుల అభిప్రాయం! బీజేపీ తన ప్రత్యర్థులపై అవినీతి, కుటుంబపాలన, అధికార దుర్వినియోగం అంటూ తీవ్ర విమర్శలు చేస్తుంది.
మరి తన పాలనలో జరిగే నిర్ణయాల విషయంలోనూ అదే కఠినమైన ప్రమాణాలను పాటించాలి కదా! ప్రత్యర్థుల విషయంలో నీతి సూత్రాలు వల్లిస్తూ, తమకు అనుకూలంగా కనిపించే సందర్భాల్లో మౌనం వహిస్తే ఆ నీతికి విలువ ఏముంటుంది? దీంతో దేశద్రోహులు విరుచుకుపడుతున్నారు!
అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవడానికి ఒక్క మెతుకు చూస్తే చాలు అంటారు. అలాగే ప్రభుత్వ నైతికతను అంచనా వేయడానికి వందల ప్రసంగాలు అవసరం లేదు. ఇలాంటి విషయాలు చాలు!
నిజాయితీ అంటే ప్రసంగాల్లో నీతులు చెప్పడం కాదు.. అధికారంలో ఉన్నప్పుడు అందరికీ ఒకే న్యాయం చేయడం. దేశం కోసం, ధర్మం కోసం అని నినదించే బీజేపీ ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి.
ప్రజల ఆస్తుల విషయంలో పారదర్శకత లేకపోతే, నిజాయితీ గురించి చేసే ప్రసంగాలన్నీ ప్రచార ఆర్భాటాలుగానే మిగిలిపోతాయి!

ఇలాంటి వాటిని అన్నియ అసలు ఎంకరేజ్ చేయడు
రాజకీయ పార్టీ ల్లో నిజాయితీ చూడ్డం మానేసి చాలా రోజులైంది. ఎవరు తక్కువ అవినీతి పరులో చూసి ఓటు వేస్తున్నాం. నిజాయితీ వాళ్ళే కావాలి అంటే NOTA ఒకటే ఆప్షన్
Anna pina 20 casulu vunnayi
annam udikinda leda?
sollu raayaku…mana jaglak anna chesina chandalam tho poliste idhi nothing..
మనదేశంలో ఒక విశిష్టత ఉన్నది.
ఓట్లు అవినీతిపరులకు వేస్తూ నీతివంతమైన ప్రభుత్వం రావాలని కోరుకుంటారు.
అవినీతిపరులకు కొమ్ము కాస్తూ వాళ్ళ ఎంగిలి మెతుకులతో బ్రతుకుతూ మరొకరి నైతికవిలువల గురించి మాట్లాడుతారు
ఇదీ అంతే
మనదేశంలో ఒక విశిష్టత ఉన్నది.
ఓట్లు అవినీతిపరులకు వేస్తూ నీతివంతమైన ప్రభుత్వం రావాలని కోరుకుంటారు.
అవినీతిపరులకు కొమ్ము కాస్తూ వాళ్ళ ఎంగిలి మెతుకులతో బ్రతుకుతూ మరొకరి నైతికవిలువల గురించి మాట్లాడుతారు
ఇదీ అంతే
ముందు నీసంగతి చెప్పు
జగన్ కి , తెలంగాణ కచరా గానికి 14, 19 లో మద్దతు ఇచ్చినప్పుడే తెలిసిపోయింది కదా …
మరి మన మెతగాడు జగ్గు కంపీనలలొ వాటా బారీ మొత్తం పెంచి కొన్నవారికి వెల ఎకరాలు ఇచ్చాడు కదా? మరి నువ్వు అప్పుడు కనీసం మొరిగావా?
మరి మన మె.-.త గాడు జగ్గు కంపీనలలొ వాటా బారీ మొత్తం పెంచి కొన్నవారికి వెల ఎకరాలు ఇచ్చాడు కదా? మరి నువ్వు అప్పుడు కనీసం మొరిగావా?
మరి మన మె.-.త గా.-.డు జగ్గు కంపీనలలొ వాటా బారీ మొత్తం పెంచి కొన్నవారికి వెల ఎకరాలు ఇచ్చాడు కదా? మరి నువ్వు అప్పుడు కనీసం మొరిగావా?
మరి మన మె.-.త గా.-.డు జగ్గు కంపీనలలొ వాటా బారీ మొత్తం పెంచి కొన్నవారికి వెల ఎకరాలు ఇచ్చాడు కదా? మరి నువ్వు అప్పుడు కనీసం మొ.-.రి.-.గా.-.వా?
మరి మన మె.-.త గా.-.డు జగ్గు కంపీనలలొ వాటా బారీ మొత్తం పెంచి కొన్నవారికి వెల ఎకరాలు ఇచ్చాడు కదా?
మరి మన మె.-.త గా.-.డు జగ్గు కంపీనలలొ వాటా బారీ మొత్తం పెంచి కొన్నవారికి వె.-.ల ఎకరాలు ఇచ్చాడు కదా? మరి నువ్వు అప్పుడు కనీసం మొ.-.రి.-.గా.-.వా?
మరి మన మె.-.త గా.-.డు
మరి మన మె.-.త గా.-.డు జగన్ కంపీనలలొ వాటా బారీ మొత్తం పెంచి కొన్నవారికి వె.-.ల ఎకరాలు ఇచ్చాడు కదా? మరి నువ్వు అప్పుడు కనీసం మొ.-.రి.-.గా.-.వా?