ఇది లాక్ డౌన్ టైమ్…కొందరికి ఇబ్బంది కావచ్చు. కానీ కొంత మందికి ఇది ఓ మంచి సదవకాశం. ముఖ్యంగా క్రియేటివ్ పీపుల్ కి. సినిమా దర్శకులు ఫుల్ గా ఇప్పుడు తమ తమ వ్యాపకాల్లో మునిగిపోయారు. కొత్త అయిడియాలకు పదును పెడుతున్నారు. కొత్త స్క్రిప్ట్ లు తయారు చేసుకుంటున్నారు. అలాంటి దర్శకులను పలకరిస్తే…
బాబూ..రెడీనా..అంటూ ఎప్పుడూ ఎవర్రెడీ ఎనర్జీతో వుండే దర్శకుడు బోయపాటి. ఆయనను ఓ సారి పలకరిద్దాం.
-సార్…బోయపాటి గారూ .ఏం చేస్తున్నారు..ఎలా వున్నారు?
థాంక్యూ అండీ..మా బాలయ్య బాబు సినిమా స్క్రిప్ట్ మీద వున్నాం.
-అదేంటీ..షూటింగ్ కూడా మొదలెట్టేసారుగా..ఇప్పుడు స్క్రిప్ట్ ఏంటి?
ఫైన్ ట్యూనింగ్…టైమ్ దొరికిందిగా..ఇంకా ఏం చేస్తే బాగుంటుంది? ఇంకా ఏం చేద్దాం..
-కొత్త స్క్రిప్ట్ లు ప్లాన్ చేయడం లేదా.
నా దగ్గర చాలా స్క్రిప్ట్ లు వున్నాయి. అయిడియాలు వున్నాయి. అవన్నీ ఓసారి దుమ్ము దులుపుతున్నాను. అందులోంచి, ఇందులోకి..ఇందులోంచి అందులోకి మార్చి, వాటిని కూడా ఫినిషింగ్ స్టేజ్ కు తెస్తున్నాను.
-ఇంతకీ బాలయ్య సినిమా సంగతులు ఏమిటి సర్..హీరోయిన్ దొరకడం లేదా?
ఏమండీ, మేము కొత్త హీరోయిన్ ను పరిచయం చేయాలని ముందుగానే అనుకున్నాం. ఆ మేరకు ఇద్దరిని షార్ట్ లిస్ట్ చేసాం. సరైన టైమ్ లో వాళ్లలో ఒకరిని పరిచయం చేయాలి అని డిసైడ్ అయ్యాం. ఈ లోగానే అందరూ, తలా వార్త రాసేస్తున్నారు. వాళ్లను అడిగారు..వీళ్లు నో అన్నారు అంటూ. సరే, మీ పని మీది, మా పని మాది అని ముందుకు వెళ్లి పోతున్నాం.
-అంటే బాలయ్య సరసన కొత్త హీరోయిన్ అన్నమాట. ఒకరా? ఇద్దరా?
ఒక్కరే. అయితే ప్యాడింగ్ ఆర్టిస్ట్ లు వుంటారు.
-అవునవును..మీ సినిమా అంటే యంగ్ లేడీస్, ట్రాడిషనల్ డ్రెస్ లు..ఫ్రేమ్ కలర్ ఫుల్ గా కళకళ లాడుతూ వుంటుందిగా..
ఉండాలి కదండీ..ప్రేక్షకులకు ఓ ఫీల్, ఓ ఆనందం ఇవ్వాలి కదా.
-ఇంకేంటి సర్. కరోనా కల్లోలం కలిసి వచ్చినట్లుంది..సంక్రాంతి..బాలయ్య సెంటిమెంట్ విడుదలకు రెడీ చేసేస్తారా సినిమాను
-అప్పటి వరకు ఎందుకు…అక్టోబర్ కు రెడీ అయిపోతుంది అనుకుంటున్నాం.. బాలయ్య కోపరేషన్ మాకు పుల్ గా వుంటుంది ఎప్పుడూ. అందువల్ల చకచకా లాగించేస్తాం.
-ఎప్పడుూ ఏదో కొత్త లోకేషన్ పరిచయం చేస్తారు. ఈ సారి విదేశాలకు వెళ్లేది లేదుగా..
చూద్దాం. ఇక్కడే బోలెడు దొరకుతాయి.
-అవును కృష్ణజిల్లాలో లోకేషన్ ను మీరే సినిమాలకు పరిచయం చేసారు కదా.
యా…చూద్దాం..ఇంకా టైమ్ వుందిగా.
-ఇంకేంటి సర్..సంగతులు
ఇంకేం వుంది ..ప్రపంచం ఈ కరోనా కల్లోలం నుంచి తేరుకోవాలి. భగవంతుడి దయతో ఈ సమస్యను మానవాళి అధిగమిస్తుందనే నమ్మకం వుంది. అప్పటి వరకు అందరూ ఇళ్లలోనే వుండి, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నా.
..విఎస్ఎన్ మూర్తి