అల్లు అర్జున్, లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్ లో రావాల్సిన సినిమా ఆగిపోయిందంటూ ప్రచారం మొదలైంది. ఆ వెంటనే బన్నీ టీమ్ అలర్ట్ అయింది. ఆ ప్రచారాన్ని ఖండించింది.
లోకేశ్-బన్నీ సినిమా ఆగిపోలేదని క్లారిటీ ఇచ్చింది. అయితే అసలు మేటర్ ఏంటంటే, లోకేశ్ ఇచ్చిన ఫైనల్ నెరేషన్ ను అల్లు అర్జున్ తిరస్కరించాడు.
ప్రారంభంలో చెప్పిన పాయింట్ కు, ఫైనల్ నెరేషన్ కు మధ్య చాలా తేడా గమనించాడు బన్నీ. అందుకే మరోసారి స్క్రిప్ట్ ను పూర్తిస్థాయిలో రీ-రైట్ చేసి రమ్మని చెప్పాడు.
కేవలం చెప్పి పంపించలేదు. లోకేశ్ కు 3 నెలలు టార్గెట్ పెట్టాడు అల్లు అర్జున్.
సో.. లోకేశ్ ముందు ఇప్పుడున్నది కేవలం 3 నెలలు మాత్రమే. ఈ 3 నెలల్లో అతడు తన ఫైనల్ స్క్రిప్ట్ తో బన్నీని ఒప్పిస్తే సరి. లేదంటే అల్లు అర్జున్ ప్లాన్-బికి షిఫ్ట్ అవుతాడు.
తమిళ్ లో బాగా పాపులర్ అయిన ఓ నవల ఆధారంగా స్క్రిప్ట్ రాసుకున్నాడు లోకేశ్ కనగరాజ్.
ఇప్పటి తరానికి తగ్గట్టు ఆ కథకు మార్పుచేర్పులు చేశాడు. అయితే ఈ మార్పులు అల్లు అర్జున్ కు నచ్చలేదు.
సో.. ప్రస్తుతానికి బన్నీ-లోకేశ్ సినిమా ఆగిపోలేదు. అలా అని ప్రాజెక్టు ఫైనల్ కూడా అవ్వలేదు. మరో 3 నెలల్లో ఈ విషయంపై క్లారిటీ వస్తుంది.
8 నెలల కిందట ఈ సినిమాను వీడియో రూపంలో ఎనౌన్స్ చేశారు. ఆ ఎనౌన్స్ మెంట్ వీడియో పెద్ద హిట్టయింది కూడా.
ఈ ఏడాదిలోనే షూటింగ్ స్టార్ట్ అవుతుందని ఆ వీడియోలో ప్రకటించారు. కానీ అదిప్పుడు జరిగేలా లేదు.
