Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

వాస్తు మార్పులు.. కాస్ట్ కటింగ్ లు

వాస్తు మార్పులు.. కాస్ట్ కటింగ్ లు

సినిమా రంగంలో సాగినంత కాలం ఏమీ పట్టించుకోరు. ఆఫీసు ధర్మసత్రం మాదిరిగా మారిపోయి, రోజూ ఎవరు పడితే వారు వచ్చి తిని పోతున్నా పట్టించుకోరు. అలాగే సాగినంత కాలం గుమ్మం ఎటువుంది, తలుపు ఎటు వుంది అన్నది కూడా పట్టించుకోరు. తేడా వచ్చినపుడు ఇవన్నీ కౌంట్ లోకి వస్తుంటాయి.

టాలీవుడ్ లో ఓ బడా నిర్మాత ప్రస్తుతం అదే పనిలో వున్నారట. ఆయన ఆఫీసులో నిత్యం బోలెడు మంది భోజనం చేస్తుంటారు. ఎవరెవరో వచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడ పిచ్చిడప్పాలు కొట్టుకుంటూ కాలక్షేపం చేస్తారు. అదో ధర్మసత్రంగా వుంటుంది. కొత్త ఆఫీసు. మంచి రిచ్ లుక్. పైగా మంచి ఫుడ్. అడిగేవారు లేరు. అందుకే అలా తయారయింది.

అయితే ఇటీవల నిర్మాతకు కాస్త ఇబ్బందులు ఎదురయ్యాయి. దాంతో ముందుగా వాస్తు మార్పులు మొదలుపెట్టారు. కొత్త ఆఫీసును వదిలి, పాత ఆఫీసులో వెళ్లి కూర్చోవడం మొదలుపెట్టారు. అక్కడితో ఆగకుండా మెస్ ను, ఖర్చులను కంట్రోల్ చేసారు. నిర్మొహమాటంగా అందరికీ చెప్పేసారట.

ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇక్కడ కూర్చుని కబుర్లు చెబుతూ, టీలు తాగుతూ, మెస్ భోజనాలు చేస్తే కుదరదని. దాంతో ఆ విధంగా ధర్మసత్రానికి డోర్లు మూత పడ్డాయి. అంతే కాదు తన భాగస్వాములకు కూడా చెప్పారట.. అయితే షూటింగ్ లో వుండండి.. లేదంటే పనుల్లో బిజీగా వుండండి.. ఎవర్ని పడితే వాళ్లను చుట్టూ కూర్చో పెట్టుకుని కబుర్లు చెబుతుంటే కుదరదని.

మొత్తానికి అనుభవం అయింది. తత్వం బోధపడింది అన్నమాట.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?