పాట హిట్ అయితే సినిమాకు లభించే హైప్, బజ్ మరో స్థాయిలో ఉంటాయి. సినిమా విడుదలకు ముందే ప్రేక్షకులకు ఆ సినిమాతో ఒక కనెక్షన్ ఏర్పడుతుంది.
ఇటీవలి కాలంలో పాటలు జనాల్లోకి వెళ్లి సినిమాల విజయానికి దోహదపడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు కిరణ్ అబ్బవరం ‘రియాలిటీ’ సినిమాకు కూడా అలాంటి పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి.
కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం రియాలిటీ. నిర్మాతగా సుధాకర్ చాగంటి తొలి సినిమా ఇది.
ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన ‘భజ గోవిందం’ పాట ఇన్‌స్టంట్‌గా ఆడియన్స్‌కు కనెక్ట్ అయింది. జాతీయ అవార్డు గ్రహీత వైకోమ్ విజయలక్ష్మి ఆలపించిన ఈ పాట వైరల్‌గా మారి జనాల్లోకి దూసుకెళ్లింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పాటతో రూపొందించిన ఓ రీల్‌ను షేర్ చేశారంటే, ఇది ఏ స్థాయిలో రీచ్ అయిందో అర్థం చేసుకోవచ్చు.
సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో అందరికీ కనెక్ట్ అయ్యేలా ఈ పాటకు ట్యూన్ కంపోజ్ చేశారు. జీవిత సారాన్ని చెప్పేలా సనారే అందించిన సాహిత్యం పాటకు మరింత ప్రత్యేకతను తీసుకొచ్చింది.
మధ్యతరగతి జీవితాలను సహజంగా ఆవిష్కరించిన ఈ పాటలో విజువల్స్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే పాట కనిపిస్తోంది. యూట్యూబ్‌తో పాటు ఇన్‌స్టాగ్రామ్‌లోనూ టాప్ ట్రెండింగ్‌లో ఉంది.
వాట్సాప్ స్టేటస్‌లోనూ ‘భజ గోవిందం’ పాట వినిపిస్తోంది. ‘భజ గోవిందం’ పాట దర్శకుడిగా కిరణ్ అబ్బవరం సంగీత అభిరుచికి అద్దం పడుతోంది.

ఆంధ్రప్రదేశ్ సీఎం కి ఇలాంటి పనికిమాలిన పనులు అంటే ఇష్టం
వాడు ఈవెంట్ మేనేజర్
కత్తులు కొడవళ్ళ తో తెరమీద నెత్తు టేరులు పారిస్తున్న సినిమాలతో పోలిస్తే ఆహ్లాద కరమైన సినిమా తెరమీద చూడడం బాగుంటుంది.. ఆ పారడైస్ సినిమా ఆ కరెంటు సీన్, పుష్ప లో గుట్కా సీన్స్ చూసి కడుపులో తిప్పని ప్రేక్షకుడు నిజమైన కళాపోషకుడు ఇప్పుడు. ఇండియా లో రోడ్ మీద పడితే కనిపించే చెత్త ఊడిచి తెరమీద పరిచే దర్శకులు ఇప్పుడు గొప్ప..
విచిత్ర ఆయుధాలతో తో తెరమీద నెత్తు టేరులు పారిస్తున్న సినిమాలతో పోలిస్తే ఆహ్లాద కరమైన సినిమా తెరమీద చూడడం బాగుంటుంది.. ఆ పారడైస్ సినిమా ఆ కరెంటు సీన్, పుష్ప లో గుట్కా సీన్స్ చూసి కడుపులో తిప్పని ప్రేక్షకుడు నిజమైన కళాపోషకుడు ఇప్పుడు. ఇండియా లో రోడ్ మీద పడితే కనిపించే చెత్త ఊడిచి తెరమీద పరిచే దర్శకులు ఇప్పుడు గొప్ప..
కత్తులు కొడవళ్ళ తో తెరమీద నెత్తుటేరులు పారిస్తున్న సినిమాలతో పోలిస్తే ఆహ్లాదకరమైన సినిమా తెరమీద చూడడం బాగుంటుంది.. ఆపారడైస్సినిమా ఆకరెంటు సీన్, పుష్పలోగుట్కాసీన్స్ చూసి కడుపులో తిప్పని ప్రేక్షకుడు నిజమైన కళాపోషకుడు ఇప్పుడు. ఇండియా లో రోడ్ మీద పడితే కనిపించేచెత్తఊడిచి తెరమీద పరిచే దర్శకులు ఇప్పుడు గొప్ప..
Cbn illaluda publicity chesukuntunada🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
విచిత్రఆయుధాలతో తెరమీదనెత్తుటేరులు పారిస్తున్న సినిమాలతో పోలిస్తే ఆహ్లాద కరమైన సినిమా తెరమీద చూడడం బాగుంటుంది.. ఆపారడైస్సినిమా ఆకరెంటు సీన్, పుష్పలో గుట్కాసీన్స్ చూసి కడుపులోతిప్పని ప్రేక్షకుడు నిజమైన కళాపోషకుడు ఇప్పుడు. ఇండియాలోరోడ్మీదపడితే కనిపించేచెత్తఊడిచి తెరమీదపరిచే దర్శకులు ఇప్పుడుగొప్ప