Advertisement

Advertisement


Home > Movies - Movie News

తాత-మనవడిగా తండ్రీకొడుకులు

తాత-మనవడిగా తండ్రీకొడుకులు

నిజజీవితంలో తండ్రీకొడుకులు వెండితెరపై కూడా తండ్రీకొడుకులుగా, స్నేహితులుగా చేసిన సందర్భాలున్నాయి. కానీ రియల్ లైఫ్ తండ్రికొడుకులు కాస్తా తాత-మనవడిగా మారబోతున్నారు. వాళ్లే బ్రహ్మానందం, ఆయన కొడుకు గౌతమ్.

హాస్య బ్రహ్మ బ్రహ్మానందం, ఆయన కొడుకు రాజా గౌతమ్ కలిసి ఓ సినిమా చేయబోతున్నారు. ఇందులో బ్రహ్మానందంది తాత పాత్ర కాగా.. రాజా గౌతమ్ ది మనవడి పాత్ర. మంచి కాన్సెప్ట్ కథలు ఎంచుకొని హిట్స్ కొట్టే రాహుల్ యాదవ్ నక్కా ఈ సినిమాకు నిర్మాత. కొత్త దర్శకుడు నిఖిల్ ఈ సినిమాను డైరక్ట్ చేయబోతున్నాడు.

మళ్లీ రావా, ఏజెంట్ సాయిశ్రీనివాస్ ఆత్రేయ, మసూద లాంటి బాక్సాఫీస్ హిట్స్ అందించిన స్వధర్మ్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ఈ కొత్త సినిమా రాబోతోంది. ఈ సినిమాకు బ్రహ్మ ఆనందం అనే టైటిల్ ఫిక్స్ చేశారు.

సినిమా ఎనౌన్స్ మెంట్ సందర్భంగా బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, రాజా గౌతమ్ మధ్య తీసిన ఓ సీన్ ను విడుదల చేశారు. ఇందులో ప్రియ వడ్లమాని హీరోయిన్ గా ఎంపిక కాగా, వెన్నెల కిషోర్ కీలక పాత్ర పోషించనున్నాడు.

త్వరలోనే సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లి, డిసెంబర్ 6న మూవీని రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. ప్రస్తుతం చాలా తక్కువగా సినిమాలు చేస్తున్నారు బ్రహ్మానందం. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?