విజయ్ తనయుడిగా ఎనలేని క్రేజ్ తో కోలీవుడ్ లో అడుగుపెట్టాడు జేసన్ సంజయ్. అయితే తండ్రి బాటలో నటనలోకి రాకుండా, మెగా ఫోన్ పట్టాడు. అలా సందీప్ కిషన్ ను హీరోగా పెట్టి జేసన్ దర్శకత్వంలో వచ్చిన సిగ్మా సినిమా ఫ్లాప్ అయింది.
ఈ సినిమా ఫ్లాప్ తో జేసన్ మనసు మారినట్టుంది. ఇప్పుడతడు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అయితే ఇక్కడ కూడా అతడు దాదాపు షాకిచ్చే నిర్ణయమే తీసుకున్నట్టు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం, అతడు కోలీవుడ్ దర్శకుడు మురుగదాస్ తో సినిమా చేస్తాడంట.
ఒకప్పుడు మురుగదాస్ టాప్ డైరక్టర్. అందులో ఎవ్వరికీ ఎలాంటి డౌట్ అక్కర్లేదు. కానీ ఇప్పుడు మురుగ ఫామ్ లో లేడు. అలాంటి దర్శకుడితో జేసన్ హీరోగా సినిమా అనగానే విజయ్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నిజానికి ఏదీ ఇంకా కన్ ఫర్మ్ కాలేదు. మరోవైపు డూడ్ దర్శకుడు కార్తీశ్వరన్ పేరు కూడా జోరుగా వినిపిస్తోంది. ఇంకోవైపు ఏకంగా ప్రదీప్ రంగనాధన్ దర్శకత్వంలో జేసన్ సినిమా ఉంటుందంటూ పుకార్లు కూడా వస్తున్నాయి.
ఇలా వినిపిస్తున్న పేర్లు అన్నీ క్రేజీగానే ఉన్నప్పటికీ, ఆ జాబితాలోకి మురుగదాస్ పేరు రావడం మాత్రం తట్టుకోలేకపోతున్నారు విజయ్ అభిమానులు.
విజయ్ తో మురుగదాస్ సినిమా చేశాడు, కానీ రికార్డులు బద్దలుకొట్టే సినిమాను అందించలేకపోయాడు. పైగా ఇప్పుడు ఫామ్ లో కూడా లేడు. త్వరలోనే జేసన్ సంజయ్ హీరోగా డెబ్యూ ఇచ్చే సినిమాకు దర్శకుడు ఎవరనేది తేలిపోతుంది.
