పులివెందులలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి రాజకీయంగా ఏమీ లేదని నిరూపించడానికి సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ డేంజర్ గేమ్ ఆడుతున్నారనే మాట బలంగా వినిపిస్తోంది.
తండ్రీతనయుల ఆటలో పులివెందులతో పాటు జిల్లాలోని కొందరు నాయకులు పావులవుతున్నారు. అయితే అధికారం వుండడంతో టీడీపీ, బీజేపీ నాయకులు చెప్పిందే వేదంగా సాగుతోంది. ఇప్పుడు అంతా సంబరం అనిపించడంలో ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.
కానీ మానసికంగా దెబ్బతిన్న వాళ్లు మాత్రం ప్రతిదీ గుర్తు పెట్టుకుంటారు. ప్రతీకారం తీర్చుకోడానికి సమయం కోసం ఎదురు చూస్తుంటారు. యాక్షన్‌కు రియాక్షన్ అనేది న్యూటన్ సిద్ధాంతం. జీవితానికైనా ఇదే వర్తిస్తుంది. ఇందులో మినహాయింపేమీ వుండదు.
అయితే పులివెందులలో అగ్గి రాజేసి, అందులో చలి కాచుకుంటామంటే ఎప్పుడూ కాలం ఒకే రకంగా వుండదనేది వైసీపీ నుంచి వస్తున్న హెచ్చరిక.
ఇవాళ మీడియాతో కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబుకు తీవ్ర హెచ్చరిక చేశారు. ఫ్యాక్షనిజాన్ని చంద్రబాబు తట్టి లేపుతున్నాడని అవినాష్ ఆరోపించారు.
చంద్రబాబూ… నీవు చేసే తప్పుడు పనులు చాలా దూరం వెళ్తాయని ఆయన తీవ్ర హెచ్చరిక చేశారు. ఇందులోని అర్థం, పరమార్థం చాలా లోతైంది. అర్థం చేసుకునే వాళ్లకు చేసుకునేంత అని పులివెందులలో మాట్లాడుకునే పరిస్థితి.
కుప్పంలో మాదిరిగా పులివెందులలోనూ స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహించి, వైసీపీని దారుణంగా ఓడించి, జగన్‌కు ఏమీ లేదని నిరూపిస్తే అడ్డు చెప్పేవాళ్లెవరూ వుండరు. కానీ పులివెందుల మున్సిపాలిటీలోనూ, నియోజకవర్గ వ్యాప్తంగా రౌడీ మూకల్ని, పోలీసుల్ని అడ్డం పెట్టుకుని పాలకులు ప్రమాదకర ఆట ఆడారు. ఇప్పటికే వ్యవహారం చాలా దూరం వెళ్లింది.
ఇక ఎన్నికల తంతు ఒక్కటే మిగిలి వుంది. ఆ రోజు కూడా దారుణాలకు ఇప్పటికే స్కెచ్ వేశారనే ఆరోపణలున్నాయి. పులివెందుల మున్సిపాలిటీలో సగం మంది వైసీపీ అభ్యర్థులతో నామినేషన్లు వేయనివ్వని వారు, ఎన్నికలను సాఫీగా సాగనిస్తారంటే నమ్మశక్యం కాదు. అందుకే ఏదైతే అది జరగనీ అని వైసీపీ నేతలు, కార్యకర్తలు అంటున్నారు.
చంద్రబాబూ…చాలా దూరం వెళ్తాయని అవినాష్ హెచ్చరించడానికి చాలా కారణాలున్నాయి. ఇప్పుడేదో పులివెందులలో తమను ఇబ్బంది పెట్టే స్థానిక, జమ్మలమడుగు నాయకుల వరకే వైసీపీ ప్రతీకారం తీర్చుకోడానికి ఆలోచిస్తుందని ప్రభుత్వ పెద్దలు అనుకోవచ్చు.
భవిష్యత్‌లో వైసీపీ అధికారంలోకి వస్తే, ఇప్పుడు చంద్రబాబు ఆలోచిస్తున్నట్టుగా జరిగితే మంచిదే. కానీ కీడు ఎంచి మేలు ఎంచాలని పెద్దలు ఊరికే చెప్పరు కదా! సూత్రధారుల్ని వదిలేసి పాత్రధారుల్ని మాత్రమే పట్టించుకుంటారని అనుకోవడం పొరపాటే. ఈ కోణంలో ఆలోచిస్తే చంద్రబాబుకు అవినాష్ హెచ్చరిక అత్యంత ప్రాధాన్యం వుంటుందని చెప్పక తప్పదు.

ఘాటు తట్టుకోలేక ముక్కు మూసుకున్న జనం
పక్క కెళ్ళి ఆడుకోరా .. ఆటలో అరటిపండు వచ్చాడు
పేమెంట్ అందాక అవినాష్ ఉడత ఊపులు… తీవ్ర హెచ్చరిక అని కవర్ డ్రైవ్ ఆడటం నీకు తప్పదు
డిక్కీ బలిసిన కోడి చికెన్ షాప్ ముందు తొడ కొట్టిందంట!! బట్ ఒకటి ఒప్పుకోవాలి ja*** గాడికన్నా వీడు బెటర్, at least వాడి లాగా పారిపోలేదు!!
2021 లో ఇదే రకంగా కుప్పంలోనూ జరిగింది. మరి అప్పుడు తమరు ఏం చేశారు? అప్పుడు ప్రజాస్వామ్యం ఎన్నికల ప్రక్రియ గుర్తు రాలేదా?
హారతి ని పడేసినంత వీజీ కాదు … దూరం వెళ్తాడంట దూరం