సినిమా: ఆదర్శ కుటుంబం
రేటింగ్: 2.5/5
బ్యానర్: హారికా అండ్ హాసిని క్రియేషన్స్
తారాగణం: వెంకటేష్, శ్రీనిధి శెట్టి, నారా రోహిత్, నివేదా పేతురాజ్, యువినా, రాజ్ ప్రజ్వల్, రావు రమేష్, సత్య, బ్రహ్మాజీ, రఘుబాబు తదితరులు
సంగీత దర్శకుడు: థమన్
ఛాయాగ్రహణం: రవి కె. చంద్రన్
ఎడిటర్: నవీన్ నోయల్
కళా దర్శకుడు: ఎ.ఎస్. ప్రకాష్
ఫైట్స్: కెవిన్ కుమార్
నిర్మాత: ఎస్. రాధాకృష్ణ
రచన, దర్శకత్వం: త్రివిక్రమ్
విడుదల తేదీ: అక్టోబర్ 30, 2026
గుంటూరు కారం తర్వాత త్రివిక్రమ్ తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ఆదర్శ కుటుంబం. త్రివిక్రమ్, వెంకటేష్‌ల క్రేజీ కాంబినేషన్ కావడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడతాయని భావించినప్పటికీ, పలుమార్లు వాయిదా పడటం, నిర్మాణపరమైన సమస్యలు వంటి కారణాలతో సినిమాకు ఆశించిన స్థాయిలో బజ్ క్రియేట్ కాలేదు. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించింది? వివరాలు చూద్దాం.
కథలోకి వెళితే.. చిట్టిబాబు (వెంకటేష్) ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి. కుటుంబాన్ని ఎలాగోలా నెట్టుకొస్తూ ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుంటాడు. అతని కంటే చాలా చిన్నదైన భార్య స్వర్ణ (శ్రీనిధి శెట్టి)కు ఖర్చు చేయడం ఎక్కువ. పైగా ఆమె చేతిలో భారీ మొత్తంలో డబ్బు కూడా పోగొట్టుకుంటుంది.
మరో వైపు టీనేజ్‌లో ఉన్న కూతురు తన సమస్యలతో ఇబ్బంది పెడుతుంటే, చిన్న కొడుకు గుండె సంబంధిత సమస్యతో బాధపడుతుంటాడు. ఇలా ఒక వైపు కుటుంబ సమస్యలు, మరో వైపు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న సమయంలో.. అనుకోకుండా వారి కుటుంబానికి ఏకంగా రూ.100 కోట్ల లాటరీ తగులుతుంది.
అయితే, ఒక్కసారిగా వచ్చిన ఈ అదృష్టమే వారికి కొత్త చిక్కులు తెచ్చిపెడుతుంది. ఆ లాటరీ విషయం తెలుసుకున్న ఓ కిరాతక దొంగల ముఠా ఆ కుటుంబాన్ని టార్గెట్ చేస్తుంది. మరి ఈ ప్రమాదం నుంచి చిట్టిబాబు తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు? ఆ దొంగల ముఠా బారి నుంచి తన వాళ్లను ఎలా రక్షించుకున్నాడు? అన్నదే మిగతా కథ.
సాంకేతికంగా చూస్తే ఈ సినిమాకు తమన్ ఆశించిన స్థాయిలో సంగీతాన్ని అందించలేదు. ఇందులో పూర్తిస్థాయిలో ఉన్నది ఒక్క పాట మాత్రమే. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. ఇక ‘మాలా’ పాటను సినిమా నుంచి తొలగించారు.
రవి కె. చంద్రన్‌కు కెమెరా పనితనం బాగుంది. నవీన్ నూలి ఎడిటింగ్ ఇంకా షార్ప్ గా ఉండాల్సింది. ముఖ్యంగా సెకండాఫ్‌లో కథనం మరింత బిగువుగా ఉండేలా కత్తెరకు పని చెప్పాల్సింది. ప్రొడక్షన్ డిజైన్ ఓకే. యాక్షన్ సీక్వెన్స్‌లను కూడా చక్కగా కంపోజ్ చేశారు. అయితే ట్రైన్ సీక్వెన్స్ మాత్రం క్రింజ్ గా ఉంది.
నటీనటుల విషయానికొస్తే.. వెంకటేష్ పాత్రను చాలా ఈజ్‌తో చేసుకుంటూ వెళ్లిపోయారు. ముఖ్యంగా ఇంట్లో జరిగే కామెడీ సన్నివేశాల్లో ఆయన టైమింగ్ బాగుంది. అలాగే యాక్షన్ సీన్స్‌లోనూ మెప్పించారు. సినిమా అక్కడక్కడ తడబడినా, తన నటనతో సినిమాను నిలబెట్టే ప్రయత్నం చేశారు వెంకటేష్.
చిన్న వయసున్న భార్యగా శ్రీనిధి శెట్టి తన పాత్రకు సరిగ్గా సరిపోయింది. అయితే, ఆమె పాత్రకు పెద్దగా నటనకు అవకాశం లేకపోయినా ఉన్నంతలో ఓకే.
వెంకటేష్ కూతురిగా యువినా, కొడుకుగా రాజ్ ప్రజ్వల్ తమ పాత్రల పరిధి మేరకు చక్కగా నటించారు.
పోలీస్ ఆఫీసర్ పాత్రలో నారా రోహిత్ స్క్రీన్ స్పేస్ తక్కువే దొరికింది. బలమైన డైలాగ్స్ కూడా లేవు.
నివేదా పేతురాజ్‌ను ప్రధానంగా గ్లామర్ కోసమే. చక్కని ప్రతిభ పెట్టుకుని ఇలాంటి పాత్రలని ఒప్పుకుంటూ పోతే ఆమె కెరీర్ కష్టాల్లో పడొచ్చు. జాగ్రత్త పడాలి. ఐటం సాంగ్ లో డింపుల్ హయాతి కనపడింది.
సత్య నటన బాగుంది. ఈ చిత్రానికి ఏకైక రిలీఫ్ ఈ కెరెక్టరే.
రావు రమేష్ మరోసారి తనకు అలవాటైన తరహా పాత్రలో కనిపించారు.
మెయిన్ విలన్‌గా ఉదయ్‌బీర్ సంధు బాగానే చేశాడు.
రఘుబాబు తనదైన కామెడీతో అక్కడక్కడా మెరిశారు.
సచిన్ ఖేడేకర్ పాత్ర చిన్నది.
‘ఆదర్శ కుటుంబం’ టైటిల్ కి తగ్గట్టు ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కాదు. ఇది ప్రధానంగా క్రైమ్ డ్రామా. దానికి తన శైలి ఫ్యామిలీ కామెడీని జోడించే ప్రయత్నం జరిగింది త్రివిక్రమ్ నుంచి.
త్రివిక్రమ్ అద్భుతమైన రచయిత, దర్శకుడు. అందులో అనుమానం లేదు. అటువంటి రచయిత నుంచి కామన్ సెన్స్ కి మరీ దూరంగా ఉండే రచనని ఊహించలేం.
100 కోట్లు లాటరీ తగలడమేంటి?
అదంతా క్యాష్ గా విత్ డ్రా చేసి ఇంటికి తీసుకురావడమేంటి?
ఏ కాలంలో ఉన్నాం మనం? అసలంత క్యాష్ విత్ డ్రా చేయడం వీలౌతుందా?
లాజిక్కులడగొద్దు.. మేజిక్ మాత్రమే చూడు.. అంటే కొడుకు చేసే జేబు కొట్టే మ్యాజిక్ తప్ప వేరే మ్యాజిక్ ఏదీ లేదిందులో.
గుప్పెడు “బ్లాస్ట్”, చారెడు “ఖాఖీ”, చిటికెడు కొరియన్ “ప్యారసైట్”, కాస్తంత హిందీ సినిమా “కిల్”..ఈ దినుసులన్నీ మిక్సీలో వేసి బలవంతపు ప్రాస డైలాగులతో ఇంగువ పోపు వేసి వండిన పదార్ధం ఈ “ఆదర్శ కుటుంబం”. అసలిందులో ఆదర్శమేముందో భూతద్దమేసినా కనపడదు.
ఫస్టాఫ్ ఆసక్తికరంగా సాగి, మంచి ఇంటర్వెల్ బ్యాంగ్‌తో ముగుస్తుంది. అక్కడక్కడా కొన్ని జోకులు పేలకపోయినా ఓవరాల్‌గా ఫస్టాఫ్ ఎంగేజింగ్‌గా ఉంటుంది.
అయితే, సెకండాఫ్‌లోనే సినిమా అసలు సమస్య మొదలవుతుంది. కుటుంబానికి సంబంధించి కొన్ని విషయాలు రివీల్ అయ్యాక, పోలీస్ ఇన్వెస్టిగేషన్ సీన్స్ మరీ రొటీన్ గా అనిపిస్తాయి. ఈ ట్రాక్స్ అంత బలంగా లేక కన్విన్సింగ్ గా అనిపించవు.
రావు రమేష్‌కు సంబంధించిన గ్రే షేడ్, ఆ తర్వాత వెంకటేష్‌తో ఆయన చేసే సంభాషణలు కూడా పేలవంగా అనిపిస్తాయి.
ఇక కుటుంబంలోని నలుగురు సభ్యుల నేపథ్యాలను వివరించే ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్ మరో పెద్ద మైనస్. ఈ ఎపిసోడ్స్ వల్ల పాత్రలపై ఎమోషనల్ కనెక్షన్ పెరగాల్సింది పోయి, కథనం కృత్రిమంగా మారుతుంది. పైగా సినిమా ఫ్లో కూడా దెబ్బతింటుంది. వాటి నుంచి వచ్చే ఎమోషనల్ సీన్స్ కూడా ఆశించిన స్థాయిలో ప్రభావం చూపించలేకపోయాయి.
త్రివిక్రమ్ సినిమా అనగానే ఆశించేది మంచి సంభాషణలు. అయితే ప్రాసలతో నవ్విస్తాయి.. లేకపోతే సత్యం చెప్పేలా ఉంటాయి! కానీ ఇందులో ఒకటి రెండు తప్ప పనికొచ్చిన సంభాషణలు లేనేలేవు. ప్రాసల కోసం వృధాప్రయాస పడ్డట్టు అనిపించింది.
“పెద్దోళ్లింతే.. ఉన్నంతకాలం ఆగ్రహం, పోయాక విగ్రహం” అని ఒక డైలాగ్. అవసరం లేకపోయినా బలవంతంగా ఇరికించిన లైన్ అది.
“పైల్స్” ప్రస్తావనతో రెండు సీన్స్ లో కాలం చెల్లిన డైలాగ్స్ ఉన్నాయి.
“నువ్వు దొరికిన చోటల్లా అప్పు చెయ్యి.. నేను పప్పు చేస్తాను”..”పాట- చీటిపాట”..లాంటి జంక్ డైలాగ్స్ విసిగిస్తూ, మాటల మాంత్రికుడి పాళ్లీ అరిగిపోతోందా అని డౌటొస్తుంది!
అయితే, మధ్యలో అక్కడక్కడా బాగున్నాయనిపించిన లైన్స్ కూడా ఉన్నాయి. అవి కూడా చెప్పుకుందాం:
– 10000 రూపాయల్ని రెండు సార్లు లెక్కపెడితే ఇరవై వేలఔతాయనుకునే అమాయకురాలు
– ప్రతి ఎక్స్ప్రెషన్ కనిపించడానికి నేనేమన్నా మోహన్ లాలా, కమల్ హాసనా?
– చచ్చే సైన్యం లేకుండా గెలిచే యుద్ధం ఏది సర్!
ఇవి మాత్రం సందర్భాన్ని బట్టి వర్కౌట్ అయ్యాయి. త్రివిక్రమ్ మార్క్ చూపించాయి.
అసలీ కుటుంబంలో ఉన్నవాళ్లు బ్యాక్ స్టోరీల్లో వల్నరెబుల్ గా కనిపిస్తారు. అలాంటిది వాళ్లల్లో ఆ డిఫెరెంట్ యాంగిల్ ఎందుకుంది? ఆ బేసిక్ లాజిక్ కూడా మిస్సింగ్.
ఒక సినిమాని ఫ్రీమేక్ చేద్దామనుకుని, మొత్తంగా చేసేస్తే కాపీ అంటారని.. నాలుగైదు సినిమాల్లోంచి ఎలిమెంట్స్ అన్నీ తీసుకుని, చివర్లో ఒక రియల్ టైం జడ్జ్ గారికి ట్రిబ్యూట్ గా ఒక సీన్ పెట్టి ఎండ్ చేసేస్తే చాల్లే అనుకుని చాలా కేర్లెస్ గా రాసిన స్క్రిప్ట్ అనిపిస్తుందిది.
అలాగే డోలో డైలాగ్ ఎందుకో అర్ధం కాదు. కామెడీ కోసం ఈ అడల్ట్ టచ్ దేనికి? సినిమా అంతా అయ్యాక ఈ డైలాగ్ గుర్తొచ్చి “చూపించిన ఆదర్శం ఇదా అనిపిస్తుంది”!
ఓవరాల్‌గా ‘ఆదర్శ కుటుంబం’ అక్కడక్కడా మాత్రమే ఆకట్టుకుంటుంది. ఫస్టాఫ్‌లో ఉన్న ఆసక్తికరమైన కథనం, వెంకటేష్ నటన, సత్య కామెడీ సినిమాకు ప్లస్ పాయింట్స్. అయితే, తడబడే సెకండాఫ్, బలహీనమైన సంగీతం, నిలకడలేని రచన, మాటల్లో బలవంతపు ప్రాసలు సినిమాను దెబ్బతీశాయి.
సెకండాఫ్ అక్కడక్కడా కొన్ని మంచి సన్నివేశాలు, మరికొన్ని తేలిపోయే ఎపిసోడ్స్‌తో సినిమా ముందుకు సాగుతుంది. ప్రేక్షకుడిని ఒకే స్థాయిలో ఎంగేజ్ చేయడంలో మాత్రం విఫలమవుతుంది.
సాధారణంగా త్రివిక్రమ్ సినిమాల్లో కథనం అక్కడక్కడా నెమ్మదించినా, మంచి పాటలతో ఆ లోటును భర్తీ చేస్తుంటారు. కానీ ఈ సినిమాలో పాటలు ఆ గ్యాప్ ఫిల్ చెయ్యలేకపోయాయి. ఏది ఎలా ఉన్నా, టైటిల్లో ఉన్న ఆదర్శం చిత్రంలో లేదు.
బాటం లైన్: ఆదర్శమేమీ లేదు!

Family Entertainer must and should watch movie!!
Movie Bagundhi
Yendhuku yeppudu kuda venkatesh movies ki bad reviews istharu Mee GA varu. cinema super ga vundhi different conseft, entertainment, twists,
ఐతే థియేటర్లో చూడాల్సిన అవసరం లేదు
ఆదర్శ కుటుంబం అంటే YSకుటుంబమే గుర్తొస్తుంది.
Yera neeku kutambam undhi kada ra kojja lanja kodaka
Nee kutambam ledha ra kojja
Nee kutumbam ledara langa kodaka
Nee yemmani adagara , meedhi adharsa kutumbam avuno kaado
avunu danilo mee amma undi ani neku gurthu vastundi kada
nevu jagan ki puttavu ani talk mana colony lo raa
ష్.. గప్ చుప్ నుంచి ఎన్నో గొప్ప సినిమాల రచయిత, దర్శకుడు జంధ్యాలే జనాలకి బోర్ తెప్పించాడు, ఇక ee కాపీ పేస్ట్ గాళ్లు సరే సరి.. బ్యాట్మన్ లో కరెక్ట్ మాట , die young as hero, live long to become villan..
పూరి పాయే, వైట్ల పాయే, వినాయక్ పాయే, కొద్దో గొప్పో రాజమౌళి, సుకుమార్ . but yeah they too live long as history tell
మేము సినిమా చూసి జోక్ వేసుకుంటున్నాము.. ఈ దీపావళి కి ఆదర్శ కుటుంబం చూడని వాళ్ళది అదృష్ట కుటుంబం అని..
కల్ట్ గిల్టు అని తేలిందిట.. రిపోర్ట్ వచ్చేసింది..
Movie pedda bokka antaav ayithe
త్రివిక్రమ్ శ్రీనివాస్, సుకుమార్, శీను బోయపాటి ఇలా కొంతమంది దర్శకులు మెగా హీరోలతో చేస్తేనే డబ్బులు తీసుకున్నట్లు ఫీల్ అవుతారేమో, వాళ్ళకే మంచి సినిమాలు తీసి పెడతారు. బోయపాటి బాలకృష్ణ తో కూడా చేస్తాడు అనుకోండి.
ఇంత అధ్వాన్నంగా ఉందని రాసి 2.5 రేటింగ్ ఏంటి?