గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. గ్రేటర్ విశాఖలో మొత్తం 120 డివిజన్లు ఉన్నాయి. రాష్ట్రంలోనే అతిపెద్ద కార్పొరేషన్.
నిజానికి విశాఖ అంటే టీడీపీకి కంచుకోట. 2019లో టీడీపీ ఘోర పరాజయంపాలైన సందర్భంలో కూడా టీడీపీకి విశాఖ అండగా నిలిచింది.
ఇక్కడ మొత్తం నాలుగు అసెంబ్లీ స్థానాలు టీడీపీకే దక్కాయి. 2024లో కూటమి సునామీలో విజయాల గురించి చెప్పాల్పిన పనిలేదు.
ప్రస్తుతానికి వస్తే కూటమి పాలన రెండున్నరేళ్లు పూర్తి చేసుకోనుంది. గ్రేటర్ కార్పొరేషన్ ఎన్నికలు వచ్చాయి. కూటమిదే విజయమని అంతా భావించారు.
అయితే వైసీపీ తరపున ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి బరిలో దిగారు. సౌమ్యరాలు, విద్యావంతురాలైన వరుదు కళ్యాణి అభ్యర్థిత్వం ఆ పార్టీకి సానుకూలంగా మారింది.
జీవీఎంసీ మేయర్ రేస్‌లో మొత్తం 15 మంది ఉన్నారు. కూటమి తరపున టీడీపీ నాయకురాలు డాక్టర్ ముక్క శ్రావణి , కాంగ్రెస్ నుంచి దేవర నాగసునందదేవి, ఇతర నేతలు పోటీలో ఉన్నారు. కూటమికి మేయర్ గెలుపు నల్లేరుపై నడక అనుకున్న చోట, అనూహ్యంగా అందరి నోట వరుదు కళ్యాణి మాట బలంగా వినిపిస్తోంది.
జనసేనను వీడానని చెప్పినప్పటికీ, ఆ పార్టీ శ్రేయస్సు గురించి నిత్యం మాట్లాడే పర్యావరణవేత్త బొలిశెట్టి సత్యనారాయణ జీవీఎంసీలో తన ఓటు వరుదు కళ్యాణికే అని వీడియో పెట్టారు. దీనికి కారణాలు కూడా ఆయన చెప్పారు.
పర్యావరణ పరిరక్షణ, విశాఖ ఉక్కు, అన్నిటికీ మించి సొంత గడ్డ శ్రేయస్సు గురించి ఆలోచించే, పనిచేసే వరుదు కళ్యాణికే తన ఓటు అని తేల్చి చెప్పారు. ఇక మిగిలిన వారి సంగతి తెలియదని అన్నారు.
విశాఖలో మేధావులు, విద్యావంతులు, ప్రకృతి ప్రేమికులు తదితరులంతా వరుదు కళ్యాణి మేయర్ అయితే బావుంటుందన్న అభిప్రాయంలో వుండడం విశేషం.
అలాగే జనసేనలో అంతర్గత విభేదాలు, టీడీపీ వెన్నుపోటు పొడిచిందన్న ఆవేదన, ఆగ్రహం కూడా వైసీపీకి సానుకూలంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
విశాఖలో వైసీపీ సృజనాత్మక ప్రచారం కూడా పార్టీ గురించి పాజిటివ్‌గా మాట్లాడేందుకు అవకాశం కల్పిస్తోంది. కిలో బియ్యం రూ.100, ఎకరా పొలం మాత్రం 99 పైసలంటూ వైసీపీ ప్రచారాన్ని హోరెత్తిస్తోంది.
అలాగే విశాఖ పరిసరాల్లో టీడీపీ నేతల భూదోపిడీ, ముఖ్యంగా ఎంపీ భరత్ గీతం యూనివర్పిటీ ముసుగులో ప్రభుత్వ భూమిని అప్పనంగా తీసుకోవడాన్ని వైసీపీ ప్రధానంగా ప్రస్తావిస్తోంది.
తమను గెలిపిస్తే, గీతం నుంచి ప్రభుత్వ భూమికి విముక్తి కల్పిస్తామని వైసీపీ మేయర్ అభ్యర్థి వరుదు కళ్యాణి బలమైన వాదనను జనంలోకి తీసుకెళ్తున్నారు.
అలాగే విశాఖలో డేటా సెంటర్ల ఏర్పాటుపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. వీటి వల్ల తీవ్ర నీటి సమస్య ఏర్పడిందని నగర వాసులు మండిపడుతున్నారు. ఇది కూడా టీడీపీ అభ్యర్థికి మైనస్ అవుతుందని అంటున్నారు.
వైసీపీ ఎమ్మెల్సీగా చట్టసభలో వరుదు కళ్యాణి బలంగా ప్రజాగొంతుక వినిపించడం ఆమెకు కలిసొచ్చే అంశం.
విశాఖ లాంటి చోట వైసీపీ మేయర్ అభ్యర్థి వరుదు కళ్యాణి గురించి మంచిగా మాట్లాడుతుండడం ఆ పార్టీలో జోష్ నింపుతోంది. రానున్న రోజుల్లో పార్టీకి మంచిరోజులనేందుకు ఇదే సంకేతం అని అంటున్నారు.

y N O T VIZAG ?
Kalyani gaaru gelichi Bolli naidu ni rajamundry lo pedite vuntaadi tammudu
అందుకే రా గొర్రె చదువుకోవాలి
why Naidu will go j . a i . l !! if she won this ?
నిజ్జంగా అంత ఉంటే.. ఈరోజే MLC పదవికి రాజీనామా చేయొచ్చు కదా?
విజ్ఞులైన “వైసీపీ కార్యకర్తలూ”, మీ శవాలమీద కుర్చీలు ఎక్కే వీడి మాటలకి రెచ్చిపోయి భలి కాకండి..
Ycpసానుభూతిపరులు ఈడి “రౌడీ రెచ్చగొట్టడు మాటలు” విని, వీడి రాజకీయ మనుగడ కోసం, రెచ్చిపోయి లేనిపోని గొడవలు సృష్టించి, కాళ్ళు చేతులు విరగ్గొట్టుకుని, “కేసుల్లో ఇరుక్కొని కుటుంబాల్ని రోడ్డున పడేయడం ఖాయం.. మేకేమైనా జరిగితే మిమ్మల్ని &మీ కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోకుండా కేవలం CBN మీద విమర్శలు చేసి, వీడేమో హాయిగా పక్క రాష్ట్రం పారిపోయి ప్యాలెస్ లో దాక్కుంటాడు..
జగన్ రాజకీయానికి బలైపోయి ఆర్థికంగా, భౌతికంగా నష్టపోయి, “జైలుపాలైన నాయకులూ, అధికారులు, కార్యకర్తలు తమ అనుభవం తో చెప్తున్న మాటలు ఇవి
నువ్వు తప్ప ఇంకెవరూ ఆవిడ పేరు చెప్పడం లేదు. నీవే నీ బుర్ర లోని ఆలోచనలు వారి గొంతు ద్వారా వినిపించే ప్రయత్నం చేస్తూ, లేని మద్దతు కూడగట్టే ప్రయత్నo చేస్తున్నావ్.నీకెందుకయ్యా జర్నలిజం, హాయిగా నీవు బాకా ఊదే పార్టీ కండువా కప్పుకోక.
తుఫాను’ నష్టం నుంచి నాలుగు రోజుల్లో కోలుకోవచ్చు, ‘జగన్’ వస్తే మాత్రం వందేళ్లయినా తేరుకోలేమంటున్న విశాఖ ప్రజలు!
Alage 2024 lo whynot 175 annaru ayina varudu kalyani gariki rushikonda palace kattinappudu paryavarana vidwasam kanapada leda
ఒకవేళ కళ్యాణి గారు గెలిస్తే…ఆ గెలుపు ను జగనన్న ఖాతా లో మాత్రం వేయవొద్దు G A
it means she is more power than power less jagan ?
Vizag people are clever they will not vote jagan, this bollisetti and all are eno batch expected minister but not got even mla so kadupumanta.