8 నెలల్లో 120 కోట్లు ఎవరైనా సంపాదించగలరా? ఎంతో అదృష్టం ఉంటే తప్ప ఇది సాధ్యం కాదు. అలాంటి అదృష్టాన్నే అందుకుంది హీరోయిన్ సమంత. ఆమె వ్యాపారం జస్ట్ 8 నెలల్లో 120 కోట్లు వృద్ధి చెందింది.
కేవలం 8 నెలల్లోనే రూ.120 కోట్ల ఆదాయం.. ఏకంగా 8 రెట్లు వృద్ధి. ఇదీ సమంత సాధించిన ఘనత. ఆమె స్థాపించిన పెర్ఫ్యూమ్ బ్రాండ్ ‘సీక్రెట్ ఆల్కెమిస్ట్’ ఇప్పుడు వ్యాపార రంగంలో హాట్ టాపిక్‌గా మారింది.
సమంతతో పాటు అంకితా థడానీ, ఆకాష్ వాలియా కలిసి స్థాపించిన ఈ బ్రాండ్ అతి తక్కువ సమయంలోనే భారీ ఆదాయాన్ని ఆర్జించింది.
‘సీక్రెట్ ఆల్కెమిస్ట్’ స్థాపన వెనక ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది సమంత. మయోసైటిస్ వ్యాధితో ఆమె బాధపడుతున్న రోజులవి. ఆరోగ్య సమస్యల వల్ల తనలోని అసలైన వ్యక్తిని గుర్తించానని, ఆ మార్పే మరిన్ని వ్యాపారాల్లోకి అడుగుపెట్టేలా చేసిందని అంటోంది సమంత.
నమ్మిన ఉత్పత్తులపై పెట్టుబడులు పెట్టడం మొదలుపెట్టానని, ఆ క్రమంలోనే ‘సీక్రెట్ ఆల్కెమిస్ట్’ మొదలైందని చెప్పుకొచ్చింది.
అనారోగ్యం కారణంగా దాదాపు రెండేళ్ల పాటు పెర్ఫ్యూమ్ లకు దూరంగా ఉన్న సమంత, ఆ తర్వాత మళ్లీ వాడడం మొదలుపెట్టినప్పటికీ, గతంలాంటి అనుభూతిని పొందలేకపోయింది. అదే టైమ్‌లో సీక్రెట్ ఆల్కెమిస్ట్ బ్రాండ్ తనకు ఎదురైందని, అలా తన వ్యాపార ప్రయాణం మొదలైందని చెప్పుకొచ్చింది.
సీక్రెట్ ఆల్కెమిస్ట్ తో పాటు సమంత వ్యాపార ప్రయాణం మరికొన్ని రంగాల్లోనూ కొనసాగుతోంది. సాకి పేరుతో మహిళల ఫ్యాషన్, లైఫ్‌స్టైల్ బ్రాండ్ కు ఆమె వ్యాపార భాగస్వామిగా కొనసాగుతోంది. మైల్ కలెక్టివ్ యాక్టివ్ వేర్, లైఫ్‌స్టైల్ బ్రాండ్ తో పాటు గటాకా సప్లిమెంట్స్ బ్రాండ్ తోనూ ఆమెకు అనుబంధం ఉంది.
ఈమధ్యే కెరీర్‌లో మా ఇంటి బంగారం సినిమాతో వంద కోట్ల హీరోయిన్‌గా అవతరించింది సమంత. ఇప్పుడు పెర్ఫ్యూమ్ బ్రాండ్‌తో 120 కోట్ల వ్యాపారవేత్తగా అవతరించింది. ఇలా ఓవైపు సినిమాలు, మరోవైపు వ్యాపారంలోనూ రాణిస్తోంది. ప్రస్తుతం బిడ్డకు జన్మనివ్వడానికి సిద్ధంగా ఉంది ఈ హీరోయిన్.

టైం బావుంది ఇప్పుడు
120 kotlu aadayam ante anta mana jebulo padatayani yevaru chepparu.. kharchulu anni ponu profit kadaa choodaali
This brand’s current valuation is sixt five crores. Atleast stop PR stunt and check authentic sources..