కొంతమంది వ్యక్తుల జీవితాల్లోకి తొంగిచూస్తే ఆశ్చర్యకర విషయాలు కనిపిస్తాయి. నిర్మాత నమిత్ మల్హోత్రా జీవితం కూడా అలాంటిదే. ఒక దశలో దాదాపు తన ఆస్తిని పోగొట్టుకున్న ఈ వ్యక్తి, ఇప్పుడు 16వేల కోట్ల రూపాయల ఆస్తికి అధిపతి.
ఒకప్పుడు ప్రపంచ ఆర్థిక సంక్షోభం దెబ్బకు తన సంపదలో 90 శాతం కోల్పోయారు నమిత్. అమెరికాలో స్థిరపడాలన్న కలలు, అంతర్జాతీయ స్థాయిలో సంస్థను నిర్మించాలన్న ఆశయాలు ఒక్కసారిగా నీరుగారిపోయాయి.
కానీ ఆ ఎదురుదెబ్బలకు కుంగిపోలేదు. పట్టుదలతో ముందుకు సాగి, నేడు ప్రపంచ సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.
నమిత్ మల్హోత్రా తన కెరీర్‌ను ముంబైలోని ఒక చిన్న గ్యారేజీలో ప్రారంభించారు. అప్పటికి ఆయన వయసు కేవలం 19 ఏళ్లు. ఒక యాపిల్ కంప్యూటర్‌తో వీడియో ఎడిటింగ్, కంప్యూటర్ గ్రాఫిక్స్ చేస్తూ సినీ రంగంలో తన ప్రయాణానికి శ్రీకారం చుట్టారు. తనకు చదువు చెప్పిన ముగ్గురు టీచర్లను పార్టనర్స్‌గా చేర్చుకున్నాడు.
1997లో తండ్రి నిర్వహిస్తున్న సంస్థతో తన వ్యాపారాన్ని విలీనం చేసి ప్రైమ్ ఫోకస్ లిమిటెడ్‌ను స్థాపించారు. సినిమాల నిర్మాణంలోకి రావాలన్న లక్ష్యంతో మొదలైన ఈ ప్రయాణం క్రమంగా పోస్ట్ ప్రొడక్షన్, విజువల్ ఎఫెక్ట్స్ రంగాల్లో అంతర్జాతీయ స్థాయికి విస్తరించింది. చిన్న గ్యారేజీలో మొదలైన ఆ ప్రయత్నమే ప్రపంచ స్తాయికి చేరింది.
అయితే ఈ ప్రయాణం అంత ఈజీగా సాగలేదు. ప్రపంచ ఆర్థిక సంక్షోభం వల్ల 2008లో తన సంపదలో 90 శాతం కోల్పోయారు నమిత్. ఆర్థికంగా భారీ నష్టాన్ని చవిచూసిన సమయంలోనూ తన అనుభవాన్ని, పరిజ్ఞానాన్ని, సినీ రంగంపై ఉన్న నమ్మకాన్ని పెట్టుబడిగా మార్చుకుని మళ్లీ ఎదిగారు.
నమిత్ నాయకత్వంలో ప్రైమ్ ఫోకస్ అంతర్జాతీయ స్థాయిలో విస్తరించింది. 2014లో లండన్‌కు చెందిన విజువల్ ఎఫెక్ట్స్ సంస్థ డబుల్ నెగటివ్ తో విలీనమైంది. ఆ తర్వాత క్రిస్టోఫర్ నోలన్ లాంటి టాప్ దర్శకుల సినిమాలకు విజువల్ ఎఫెక్టులు అందించింది. ఈ క్రమంలో 8 ఆస్కార్లు అందుకుంది నమిత్ సంస్థ.
అలా 90 శాతం ఆస్తిని కోల్పోయిన దశ నుంచి 16వేల కోట్ల నెట్ వర్త్‌కు ఎదిగారు నమిత్. హురున్ ఇండియా-2026 నివేదిక ప్రకారం, నమిత్ మల్హోత్రా కుటుంబ సంపద సుమారు ప్రస్తుతం రూ.16,000 కోట్లు.
4వేల కోట్ల రూపాయలు పెట్టి రామాయణ ఇతిహాసాన్ని 2 భాగాలుగా నిర్మించారు నమిత్. ఇండియాలో కాదు, ప్రపంచంలోనే అతి భారీ బడ్జెట్ సినిమాల్లో ఒకటిగా గుర్తింపు తెచ్చుకుంది ఈ ప్రాజెక్టు.

మన అన్న మీద కూడా ఇలాంటి ఒక ఆర్టికల్ వెయ్యొచ్చుకదా..కష్టపడి సంపాదించి ఎలా ఎదిగాడో..వివరంగా
at the same time, can you please enlighten us on how Chamba became a billionaire from two acres
ఎలిమెంటరీ స్కూల్ గంట కొట్టి లక్షలు, బ్రిటిషర్స్ కి బీఫ్ అమ్మి కోట్లు కొల్లగొట్టి వుంటాడు..”మనోడిని” ఎన్లైటెన్ చెయ్యమంటే సరి..
-#ఎలిమెంటరీ-#స్కూల్-#గంట-#కొట్టి-#లక్షలు, -#బ్రిటిషర్స్ కి -#బీఫ్ -#అమ్మి -#కోట్లు -#కొల్లగొట్టి -#వుంటాడు..-”#మనోడిని”-#ఎన్లైటెన్-#చెయ్యమంటే-#సరి..
-#_ఎలిమెంటరీ-#_స్కూల్-#_గంట-#_కొట్టి-#_లక్షలు, -#_బ్రిటిషర్స్ కి -_#బీఫ్-/_అమ్మి -#_కోట్లు -#_కొల్లగొట్టి -#_వుంటాడు..-”#_మనోడిని”-_#ఎన్లైటెన్-#_చెయ్యమంటే-#_సరి..
“మనోడు” రిప్లై ని బ్లాక్ చేస్తున్నాడు..
“మానోడు” రిప్లై బ్లాక్ చేస్తా వుండ్లా..
“{\మానోడు#” -/రిప్లై {-బ్లాక్ {-చేస్తా #{-వుండ్లా..
-#}ఎలిమెంటరీ-#_}స్కూల్-#_}గంట-#_}కొట్టి-#_}లక్షలు, -#}బ్రిటిషర్స్ -కి-#బీఫ్-}అమ్మి -#}కోట్లు -#}కొల్లగొట్టి -#}వుంటాడు..-”#}మనోడిని”-_}#ఎన్లైటెన్-#}చెయ్యమంటే-#}సరి..
-#}ఎలిమెంటరీ-#_}స్కూల్-#_}గంట-#_}కొట్టి-#_}లక్షలు, -#}బ్రిటిషర్స్}-}కి-}బీఫ్-}అమ్మి -#}కోట్లు-}కొల్లగొట్టి-}వుంటాడు..-”}మనోడిని”-}#ఎన్లైటెన్-#}-చెయ్యమంటే-#}సరి..
Mundu rich aina babu gari meeda rayala
అడగండి ఎంకటికి..”మనోడే” కదా.
Not easy to recover, requires a lot of will power, but reading them in 2-3 paras looks easy though
Evaru rich ainna antha public money thone kadha😂😂😂😂🤣🤣🤣🤣🤣🤣