తిరుపతిలో కార్పొరేషన్ టికెట్ కోసం ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తనను రూ.50 లక్షలు డిమాండ్ చేశాడని, మనస్తాపం చెందిన కరడుగట్టిన జనసేన నాయకుడు రాజేష్ ఆచారి ఆత్మహత్యా యత్నం చేశారు.
పార్టీ ఆవిర్భావం నుంచి పని చేస్తున్న తనను పట్టించుకోకపోవడంపై జనసేన నాయకుడు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. గత రాత్రి ఉరివేసుకుని బలవన్మరణం చెందే ప్రయత్నం చేశారు. అయితే చివరి నిమిషంలో కుటుంబ సభ్యులు గమనించి కాపాడుకున్నారు. ఈ ఘటన జనసేనలో కలకలం రేపుతోంది.
తిరుపతిలో 47వ డివిజన్‌లో మొట్టమొదటగా జనసేన కార్యాలయాన్ని రాజేష్ ఆచారి ప్రారంభించారు. సార్వత్రిక ఎన్నికల్లో జనసేన గెలుపు కోసం పని చేశారు. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా తిరుపతి కార్పొరేషన్‌లో 47వ డివిజన్ నుంచి పోటీ చేయాలని భావించారు. అతనికి జనసేన బీ ఫామ్ కూడా ఇచ్చారు.
అయితే కలెక్టర్ కార్యాలయంలో తమ అభ్యర్థి అని నిర్ధారిస్తూ, పార్టీ ఎ ఫామ్ ఇవ్వాల్సి వుంటుంది. అయితే ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఆ పని చేయలేదు. దీంతో జనసేన అభ్యర్థి రాజేష్ ఆచారికి గట్టి షాక్ తగిలింది.
47వ డివిజన్ నుంచి టీడీపీ నేత ఆర్సీ మునికృష్ణకు ఆ పార్టీ టికెట్ ఇచ్చింది. ఇందుకోసం నిఖార్సైన రాజేష్ ఆచారిని బలిపెట్టారనేది జనసేన శ్రేణుల ఆరోపణ.
ఈ నేపథ్యంలో 47వ డివిజన్ నుంచి రాజేష్ ఆచారి రెబల్‌గా బరిలో దిగినట్టు తెలుస్తోంది. మరోవైపు బరి నుంచి తప్పుకోవాలని అతనికి బెదిరింపులు.
ఈ నేపథ్యంలో గత రాత్రి ఇంట్లో ఉరి వేసుకునేందుకు యత్నించారు. కుటుంబ సభ్యులు గుర్తించి, అతన్ని కాపాడుకున్నారు.
అనంతరం రాజేష్ ఆచారి, ఆయన సతీమణి మీడియాతో మాట్లాడుతూ తిరుపతిలో 22 మంది జనసేన తరపున పోటీ చేస్తున్నారన్నారు. కేవలం నలుగురు మాత్రమే నిజమైన జనసేన నాయకులని చెప్పారు.
హవాయి చెప్పులు వేసుకునే వారిని ఎమ్మెల్యేగా చేస్తానని పవన్‌కల్యాణ్ చెప్పారని గుర్తు చేశారు. హవాయి చెప్పుల విలువ రూ.50 లక్షలని వారు ఆరోపించారు.
కార్పొరేషన్‌లో సీటు కోసం ఎమ్మెల్యే రూ.50 లక్షలు డిమాండ్ చేశారని వారు ఆరోపించారు. జనసేన కోసం తామెంతగానో నష్టపోయానని, చివరికి రోడ్డున పడేశారని రాజేష్ దంపతులు ఆరోపించారు.

వచ్చి టీడీపీ లో చేరిపోతే మేలు కదా
ఈ మధ్య జగన్ మాటల్లో, చేతల్లో కనిపిస్తున్న రాజకీయ పరిణితి ఒక వైపు – గత కొద్దికాలం గా కూటమి పని తీరు, చేష్టలు, ధోరణి, నామినేషన్ ప్రక్రియలు మరియూ మీడియా వ్యవహరిస్తున్న తరహా మరో వైపు. ఇవన్నీ నిశితం గా గమనించి చూస్తే 97% జగన్ 2.0 ఖాయమనే భావన కలుగుతుంది.
పద్మవ్యూహం లో చిక్కుకునే అభిమన్యుడు కాదు, పద్మవ్యుహాన్ని చేధించే అర్జునుడు లా ఎదుగుతున్నాడు జగన్ !
టీడీపీ కీ కష్టం మే ఇలాంటి వారి వల్ల అందరు వైస్సార్సీపీ కీ పోతారు మళ్ళీ 151 లోడింగ్ దిశగా వైస్సార్సీపీ
మళ్ళీ వైస్సార్సీపీ వచ్చేకి జనసేన నా సహకారం అందేలా ఉంది ఇప్పుడు జనసేన ఒంటరిగా పొతే మేలు టీడీపీ గెలిచేకి
Pawan Kalyan cm aithee Andhariki nyayam chesthadu
హవాయి చెప్పుల ధర ఎభయ్యి లక్షలు అయితే మరి సీఎం చేస్తే అందరికీ తలొక జత ఇస్తాడు. మీ వీలు కొద్ది వాడుకోండి. బుగ్గలు వాచాయని ఎవరు అనొద్దు.. వేటి దెబ్బలు వాటివే..