శింబు-నయనతార ప్రేమ వ్యవహారం ఒకప్పుడు కోలీవుడ్ ను కుదిపేసింది. 2006లో వచ్చిన ‘వల్లభ’ షూటింగ్ సమయంలో వీళ్లిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. అది చాలా దూరం వెళ్లింది. అప్పట్లో వీళ్లిద్దరి ప్రైవేటు ఫొటోలు కూడా ఇంటర్నెట్ లో లీక్ అయ్యాయి.
ఆ తర్వాత కొన్నాళ్లకే ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి విడిపోయారు. తామిద్దరం విడిపోయామని అధికారికంగా ప్రకటించారు కూడా. తాను శింబుతో ఎలాంటి సంబంధం పెట్టుకోనని, కలిసి నటించనని కూడా నయనతార అప్పట్లో ప్రకటించేసింది.
అయితే ఆ తర్వాత మనసు మార్చుకుంది. విడిపోయిన పదేళ్లకు శింబుతో కలిసి ఓ సినిమా చేసింది. మళ్లీ ఇన్నేళ్లకు అతడితో మరో సినిమా చేయడానికి అంగీకరించింది నయనతార.
కోలీవుడ్లో ఒకప్పుడు హాట్ టాపిక్ గా కొనసాగిన ఈ జంట ఇప్పుడు మళ్లీ సిల్వర్ స్క్రీన్ పై కనువిందు చేయబోతోంది. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. అన్నీ అనుకున్నట్టు జరిగితే లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సినిమా ఉంటుంది.
పోలీస్ బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న ఈ కొత్త సినిమాలో యాక్షన్ అవతార్ లో కనిపించబోతోంది నయనతార. ఆమెపై కొన్ని యాక్షన్ సన్నివేశాలు కూడా ఉంటాయి.
నయన్ ఓకే అంటే డిసెంబర్ నుంచి షూటింగ్ ప్రారంభిస్తారు. సాయి అభ్యంకర్ ఈ సినిమాకు మ్యూజిక్ డైరక్టర్.
ప్రస్తుతం శింబు, వెట్రిమారన్ దర్శకత్వంలో ‘అరసన్’ సినిమా చేస్తున్నాడు. ఈ లోపే ఈ మాజీ ప్రేమికులు కలవబోతున్నారనే వార్త తెగ వైరల్ అవ్వడంతో, ఈ కాంబినేషన్ పై అప్ డేట్ కోసం అంతా ఎదురుచూస్తున్నారు.

She can do anything with anyone as she is lady superstar