వంగ‌వీటి వెంట లంపెన్ గ్యాంగ్.. ఏబీవీ మాట‌ల మంట‌!

వైసీపీ నుంచి మాజీ మేయ‌ర్ భాగ్య‌ల‌క్ష్మి పోటీలో దిగారు. సామాజిక స‌మీక‌ర‌ణల రీత్యా కూట‌మికి రాజ‌కీయంగా సానుకూల‌త వుంది.

విజ‌య‌వాడ‌లో మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో ప్ర‌చారం హోరెత్తుతోంది. కూట‌మి, వైసీపీ మ‌ధ్యే పోటీ వుంటుంద‌ని అనుకుంటున్న త‌రుణంలో మెరుపు తీగ‌లా తానున్నా అంటూ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు రంగంలో దిగారు. ఈయ‌న‌కు వామ‌ప‌క్షాలు, కాంగ్రెస్‌, కొంత మంది త‌ట‌స్థులు మ‌ద్ద‌తు తెలిపారు.

ఈ నేప‌థ్యంలో విజ‌యవాడ మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌లో కూట‌మి, వైసీపీ, ఏబీవీ మ‌ధ్య ముక్కోణ‌పు పోటీ వుంటుంద‌నే ప్ర‌చారం విస్తృతంగా సాగుతోంది. కూట‌మి అభ్య‌ర్థిగా జ‌న‌సేన నాయ‌కుడు వంగ‌వీటి రాధాకృష్ణ బ‌రిలో నిలిచారు.

వైసీపీ నుంచి మాజీ మేయ‌ర్ భాగ్య‌ల‌క్ష్మి పోటీలో దిగారు. సామాజిక స‌మీక‌ర‌ణల రీత్యా కూట‌మికి రాజ‌కీయంగా సానుకూల‌త వుంది. అందుకే కూట‌మి విజ‌యం న‌ల్లేరుపై న‌డ‌క అని అంతా అనుకున్నారు.

ఎప్పుడైతే ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు బ‌రిలో దిగారో, పోటీ మ‌రో మలుపు తిరిగింది. విజ‌య‌వాడ చైత‌న్య‌వంత‌మైన న‌గ‌రం. క‌మ్యూనిస్టులు ఏలిన ఆ గ‌డ్డ‌లో కుల వాస‌న‌లు కూడా అంతేస్థాయిలో వున్నాయి.

ఇది ఎవ‌రూ కాద‌న‌లేని వాస్త‌వం. మూడో ప్ర‌త్యామ్నాయంగా ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు బ‌రిలో దిగ‌డం వెనుక‌, అదృశ్య శ‌క్తులున్నాయ‌ని జ‌న‌సేన అనుమానిస్తోంది. ఇదే నిజ‌మ‌ని న‌మ్మేందుకు, ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు తీవ్ర ఆరోప‌ణ‌లు బ‌లం చేకూరుస్తున్నాయి.

వంగ‌వీటి రాధా మంచి వాడు, సౌమ్యుడు అంటూనే, అత‌ని వెనుక లంపెన్ గ్యాంగ్ వుంద‌ని ఏబీవీ తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. ఒక‌వేళ కూట‌మి అభ్య‌ర్థిని ఎన్నుకుంటే, లంపెన్ గ్యాంగ్ అంతా వంగ‌వీటి రంగా పేరు చెప్పుకుని అరాచ‌కాలు సృష్టిస్తుంద‌ని, అప్ర‌మ‌త్తంగా వుండాల‌ని ఏబీవీ హెచ్చ‌రించ‌డం జ‌న‌సేన శ్రేణుల్లో తీవ్ర ఆగ్ర‌హం తెప్పిస్తోంది.

అందుకే ఏబీవీకి వ్య‌తిరేకంగా జ‌న‌సేన నేత‌లు నోరు తెరుస్తున్నారు. నువ్వే అతిపెద్ద అవినీతిప‌రుడివి అంటూ జ‌న‌సేన నేత‌లు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.

మ‌రీ ముఖ్యంగా టీడీపీ అనుకూల మీడియా ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావుకు విశేష ప్రాధాన్యం ఇవ్వ‌డం జ‌న‌సేన నేత‌ల‌కు అస‌లు న‌చ్చ‌డం లేదు. ఇదంతా ప‌క్కా ప్ర‌ణాళిక‌తోనే సాగుతోందని జ‌న‌సేన నేత‌లు ఆరోపిస్తున్నారు.

టీడీపీ త‌మ‌ద‌ని భావించే ఒక సామాజిక వ‌ర్గ‌మంతా ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు వెంట న‌డుస్తోంద‌న్న చ‌ర్చ విస్తృతంగా జ‌రుగుతోంది. విజ‌య‌వాడ మేయ‌ర్ ఎన్నిక‌ల్లో పొర‌పాటున వంగ‌వీటి రాధా ఓడితే మాత్రం, రాజ‌కీయాల్లో చాలా మార్పులు చోటు చేసుకునే అవ‌కాశం వుంది.

10 Replies to “వంగ‌వీటి వెంట లంపెన్ గ్యాంగ్.. ఏబీవీ మాట‌ల మంట‌!”

  1. రాధా ఓడితే తెదేపా కు నష్టం… వైకాపాకీ నష్టమే… ఎలా అంటే… JSP కేవలం తెదేపా ఓట్స్ మాత్రమే కాదు… మూవీ చీలుస్తోంది.. ఒంటరిగా దిగితే

      1. నాలుగో పెళ్ళాం జగేన్ ఇంటికా? జగేన్ తో కాపురం చేసి మగ బిడ్డని కనిస్తాడా?

  2. వై సీ పీ ఒక్క మేయర్ కూడా గెలవట్లేదు

    EVM లు అని తప్పించుకోవడానికి కూడా లేదు ఈసారి మూడు పార్టీలు రౌండప్ చేసి చిత్తకొడతారు

  3. తొర్రి పేర్నినాని ఎలహంక ప్యాలెస్ లో జగేన్ షర్మిలకి సపరేటేగా సర్వెంట్ క్వార్టర్లతో కూడిన రెండు భవనాలు ఉన్నాయ్..కానీ ఆ దొడ్లోకి పోవడానికి మాత్రం ఒకటే గేట్ ఉంది. So షర్మిల ఆమె ఇంట్లో పెళ్లి జరిపిస్తే అందరూ ఇదే గేట్ గుండా మావోడి ఇంట్లోకి కూడా వస్తారు, వచ్చి అంతా చూసేసి మావోన్ని డెంగీ, అక్కడున్న నేలమాలిగల ఫోటోలు, వీడియోలు తీసి నానా రీల్స్ చేసి పెంట పెంట చేస్తారు.. 

    కావున సీక్రెట్ గా ఉన్న మావోడి లైఫ్ బజారున పడుతుంది అందుకే వేరే venue చూసుకున్నాడు.. ఇందులో తెప్పేముంది అన్నాడు.. 

    సో తొర్రి నాని తో చెప్పించిన పలుకుల ప్రకారం షర్మిలకి ఎలహంక ప్యాలెస్ లో సగభాగం ఉందా లేదా

Comments are closed.