ఏపీలో స్థానిక ఎన్నికలు చూస్తే అతి పెద్ద రాజకీయ పోరాటానికే తెర తీసినట్లుగానే ఉంది. సార్వత్రిక ఎన్నికలకు సరిసాటిగా ఈ ఎన్నికలు ఉన్నాయి. కూటమి పార్టీలు మూడూ ఒక వైపు ఉన్నాయి. అంగబలం, అర్థబలం, అధికార బలం ఆ వైపు ఉంటే.. విపక్షంలో ఒంటరిగా వైసీపీ ఎదుర్కోవాల్సి వస్తోంది.
ఈ ఎన్నికల్లో వైసీపీ పోటీ చేయలేదని, చేసినా డిపాజిట్లు కూడా రావని, ఆ పార్టీ పని అయిపోయిందని కూటమి నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఆ వైపు నుంచి నాయకులు అంతా ఎద్దేవా చేసిన పరిస్థితి. అసలు ఎందుకు పోటీ అని కూడా నిరసనగా చూసిన నేపథ్యం ఉంది.
అలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా వైసీపీ ధైర్యంగా పోటీ పడుతోంది. కూటమి బలాన్ని ధీటుగానే ఎదుర్కొంటోంది. ఏకగ్రీవాలు అన్నీ కూటమికే వెళ్తున్నాయి. అయితే, ఆశ్చర్యకరమైన విషయంగా చూస్తే వైసీపీ కూడా ఏకగ్రీవాల్లో తొలి బోణీ కొట్టడం.
ఆ పార్టీ అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలంలో ఏకగ్రీవ ఫలితాన్ని అందుకుంది. మండలంలో సెజ్ పునరావాస కాలనీ దిబ్బపాలెం–1 ఎంపీటీసీ స్థానానికి వైసీపీ అభ్యర్థి లాలం నాగమణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
లాలం నాగమణి భర్త లాలం శ్రీనివాసరావు గతంలో దిబ్బపాలెం–1 ఎంపీటీసీగా పనిచేసి పదవీకాలాన్ని పూర్తి చేసుకున్నారు.
ఆ విధంగా ఈ స్థానాన్ని ఏకగ్రీవంగా కైవసం చేసుకోవడం ద్వారా వైసీపీ ఈ ప్రాంతంలో తన ఉనికిని చాటుకుంది. మండల ఎంపీపీ అభ్యర్థిగా కూడా లాలం నాగమణి పేరు ఖరారు కావడంతో ఈ ఏకగ్రీవ విజయం వైసీపీ శ్రేణుల్లో కొత్త హుషారును తెచ్చింది.
ఈ మండలం ఎలమంచిలి నియోజకవర్గంలో ఉంది. ఇక్కడ జనసేన ఎమ్మెల్యే ఉన్నారు. టీడీపీకి బలమైన స్థావరంగా ఉన్న ఈ చోట వైసీపీ ఏకగ్రీవంగా ఒక ఎంపీటీసీని గెలవడం విశేషంగానే చెప్పుకుంటున్నారు.

ఎంత బెదిరించారో…. ఏమి ఆశ చూపారో.. దొడ్డి దారిన ఏకగ్రీవం చేసుకున్నారు… అనచ్చా?
అనలేము, ఎందుకంటే ఆమె TDP అభ్యర్థి కాదు.
2.0.2.1 లో కూడా టీడీపీ అభ్యర్థులు కాదు కదా
Bedirinchi tdp vallani nomination veyyanivvakundaa eka greevam chesukunnaaru.
దీన్ని బట్టి చుస్తే ఇప్పుడు 3 పార్టీ లు మరియు అధికారం ఉంది కూడా వైస్సార్సీపీ కట్టడి చెయ్యలేక పోయారు జనరల్ ఎలక్షన్ వైస్సార్సీపీ దెబ్బ కూటమి దిగిపోవడం ఉండేది
0.00001% votes vaste kuudaa election lo geluataaraa😂🤣
It is proof that election happening in fair manner
ఒకటికి ఇంకోటి జత కలిస్తే 11 అవుతుంది. Good , keep it up.
Louda le