సీక్రెట్ బాయ్ ఫ్రెండ్‌తో హీరోయిన్ దీపావళి వేడుకలు

హీరోయిన్ కృతిసనన్ మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఈసారి దీపావళి వేడుకలను తన రహస్య స్నేహితుడు కబీర్ బహియాతో జరుపుకుంది

హీరోయిన్ కృతిసనన్ మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఈసారి దీపావళి వేడుకలను తన రహస్య స్నేహితుడు కబీర్ బహియాతో జరుపుకుంది. దీనికి సంబంధించిన ఫొటోల్ని కూడా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేయడం విశేషం.

ఈ ఫొటోల్లో కృతి తన తల్లిదండ్రులు, సోదరి నుపుర్ సనన్‌తో కలిసి ఫొటోలకు పోజులిచ్చింది. అలాగే నుపుర్ భర్త, సింగర్ స్టెబిన్ బెన్‌తో పాటు కృతి బాయ్‌ఫ్రెండ్ కబీర్ బహియా కూడా ఇందులో కనిపించాడు. అయితే కబీర్‌తో సోలోగా దిగిన ఫొటోల్ని మాత్రం ఆమె షేర్ చేయలేదు. ఈ వేడుకల్లో ప్రేమపక్షులిద్దరూ మ్యాచింగ్ కలర్ దుస్తుల్లో కనిపించారు.

ఏటా దీపావళి పార్టీలకు హాజరవుతుంటుంది కృతి సనన్. అయితే ఈసారి మాత్రం స్వయంగా ఆమె దీపావళి పార్టీ ఇచ్చింది. కరణ్ జోహార్, సోనాక్షి సిన్హా లాంటి క్లోజ్ సర్కిల్‌ను ఆహ్వానించింది. కబీర్‌ను పరిచయం చేసేందుకు ఇలా దివాళీ పార్టీని వాడుకుందని చాలామంది భావిస్తున్నారు.

తన రిలేషన్‌షిప్ రూమర్స్‌పై గతంలోనే స్పందించిన కృతి సనన్. పెళ్లయ్యే వరకు తన వ్యక్తిగత జీవితం గురించి బయట మాట్లాడనని తేల్చిచెప్పింది. కొన్ని విషయాలు తనకి, తన సన్నిహితులకు మాత్రమే పరిమితం కావాలని కోరుకుంటున్నానని వెల్లడించింది. అలా చెబుతూనే, మరోవైపు ఎప్పటికప్పుడు కబీర్ తో ఇలా కనిపిస్తోంది.

బ్రిటన్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కబీర్ బహియా. వరల్డ్ వైడ్ ఏవియేషన్ అండ్ టూరిజం లిమిటెడ్ అనే సంస్థ వ్యవస్థాపకుడు ఇతడు. యూకేకు చెందిన ప్రముఖ ట్రావెల్ కంపెనీ ‘సౌతాల్ ట్రావెల్’ అధినేత కుల్జిందర్ బహియా కుమారుడే ఈ కబీర్ బహియా. లక్షల కోట్ల ఆస్తికి వారసుడు ఇతడు.

2 Replies to “సీక్రెట్ బాయ్ ఫ్రెండ్‌తో హీరోయిన్ దీపావళి వేడుకలు”

Comments are closed.