సీపీఎస్ ఉద్యోగులకు భారీస్థాయిలో చంద్రబాబునాయుడు ప్రభుత్వం ఊరట కల్పించినట్టుగా మీడియా ఇప్పుడు ఊదరగొడుతోంది. అర్హులైన ఉద్యోగులు పాత పింఛను విధానంలోకి మారేందుకు అవకాశం కల్పిస్తున్నదంటూ.. అదేదో మొత్తం ఉద్యోగులందరికీ మహ గొప్ప మేలు చేసేసినట్టుగా బిల్డప్పులు ఇస్తున్నారు.
ఇప్పుడు ప్రభుత్వం కల్పించిన వెసులుబాటు ద్వారా.. సీపీఎస్ కేటగిరీలో ఉన్న కొందరు ఉద్యోగులకు వెసులుబాటు కలగవచ్చు గాక.. కానీ.. ఆ నిర్ణయం వెనుక చంద్రబాబునాయుడు కృషి, సంకల్పం, ఔదార్యం లాంటివి ఉన్నాయని అనుకుంటే భ్రమే. అలా ఉన్నాయని అధికార పార్టీలు చెప్పుకుంటే అది ప్రజల్ని వంచించడమే.
కొన్ని కోర్టు తీర్పులు, కేంద్రం కూడా అనివార్యంగా అనుసరించవలసి వచ్చిన విధానం, పర్యవసానంగా రాష్ట్రాలు కూడా ఫాలో కావాల్సిన నేపథ్యంలో మాత్రమే సీపీఎస్ ఉద్యోగులకు ఊరట దక్కుతున్నది తప్ప.. అది చంద్రబాబు ప్రభుత్వం చేసిన మేలుగా గుర్తించాల్సిన అవసరం లేదని ఉద్యోగ సంఘాల వారు పేర్కొంటున్నారు.
వివరాల్లోకి వెళితే.. 2004లో సెప్టెంబరు 1 నుంచి సీపీఎస్ విధానం అమల్లోకి వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ తేదీ కంటె ముందే ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదలై ఉండి.. అనేక రకాల కారణాల వల్ల ఉద్యోగాల నియామకాలు ఆలస్యం అయినందు చేత కొందరు ఆ తేదీ తర్వాత ఉద్యోగాల్లో చేరడం కూడా జరిగింది.
అయితే వారందరికీ కూడా నియామక తేదీని అనుసరించి.. సీపీఎస్ పెన్షను విధానాన్నే ఇప్పటివరకు వర్తింపజేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో అలాంటి ప్రత్యేక కేటగిరీకి చెందిన ఉద్యోగులందరూ విడిగా కోర్టుకు వెళ్లారు.
కోర్టు తీర్పుల ప్రకారం.. 2004 సెప్టెంబరు 1వ తేదీకంటె ముందుగానే విడుదలైన నోటిఫికేషన్ ను అనుసరించి ఉద్యోగాల్లో జాయిన్ అయిన వారందరికీ పాత పెన్షన్ విధానమే వర్తిస్తుంది. ఆ నోటిఫికేషన్ ప్రకారం వచ్చిన ఉద్యోగాల్లో ఆ తేదీ కంటె తరువాత చేరి ఉన్నా కూడా వారికి పాత పెన్షన్ స్కీమే వర్తించాలని తీర్పు వచ్చింది.
ఆ మేరకు ఆ కేటగిరీలోని ఉద్యోగులు పాత పెన్షన్ స్కీము కావాలంటే తమ సమ్మతి తెలియజేయవచ్చునని ప్రభుత్వాలు ముందుకు వస్తున్నాయి.
కేంద్ర ప్రభుత్వం చాలా కాలం కిందటే.. ఈ పని పూర్తిచేసింది. గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం సీపీఎస్ ఉద్యోగులకు మూకుమ్మడిగా మెరుగైన ప్రయోజనం అందించాలనే లక్ష్యంతో కొన్ని ఆలోచనలు చేసినందువల్ల.. దీని జోలికి వెళ్లలేదు.
ఇప్పుడు చంద్రబాబునాయయుడు సర్కారు వచ్చిన రెండున్నరేళ్ల తర్వాత.. దీనిని అమలు చేస్త్తూ జీవో తెచ్చారు. ఈ కేటగిరీ ఉద్యోగులు డిసెంబరు 1 లోగా పాత పెన్షను స్కీము కావాలో, సీపీఎస్ కావాలో ఆప్షన్లు ఇవ్వాలని కోరారు.
దీని ప్రకారం.. సర్వీసులో ఉన్నవారు, ఆల్రెడీ రిటైరు అయిన వారు, అలా జాయిన్ అయి మరణించిన వారి ఫ్యామిలీ పెన్షనర్లు కూడా ఈ ఆప్షన్ ఎంచుకోవచ్చు. కాగా, ఈ వెసులుబాటు.. ఆ ఉద్యోగులు పోరాడి సాధించుకున్న హక్కే తప్ప.. చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా ఒరగబెట్టినది లేదని ఉద్యోగులు వాదిస్తున్నారు.
ఆయనకు అంత చిత్తశుద్ధి, ఉద్యోగులపై ప్రేమ ఉంటే గనుక.. మొత్తం సీపీఎస్ విధానాన్నే రద్దుచేయాలని కూడా కోరుతున్నారు.

తూ నీ బతుకు, ఒక్క విషయంలో ఐన నిజాయితీ గా ఉండరా స్వామి…