ప్రతి నటుడికి కెరీర్ లో కొంత అసంతృప్తి ఉంటుంది. అది సినిమా అపజయాల వల్ల కావొచ్చు, స్టోరీ సెలక్షన్ వల్ల కావొచ్చు. హీరో ఎన్టీఆర్ కు కూడా కెరీర్ ప్రారంభంలో అలాంటి ఓ అసంతృప్తి ఉంది.
కెరీర్ ప్రారంభంలో కాస్త బొద్దుగా ఉండేవాడు ఎన్టీఆర్. మొదటి సినిమా నుంచి దాదాపు 10-12 సినిమాల వరకు అదే బొద్దు పర్సనాలిటీతో కనిపించాడు. దర్శకుడు రాజమౌళి, ఇతడ్ని పూర్తిగా మార్చేశాడు.
రాజమౌళి ఇచ్చిన సలహాలు, సూచనలతో యమదొంగ నుంచి ప్రేక్షకులు కొత్త ఎన్టీఆర్ ను చూశారు. అప్పటి తన బాడీ ట్రాన్స్ ఫర్మేషన్ పై తాజాగా స్పందించాడు ఎన్టీఆర్. శరీరాకృతిపై తనలో ఉన్న అసంతృప్తిని బయటపెట్టాడు.
“కెరీర్ స్టార్టింగ్ లో కాస్త బొద్దుగా లావుగా ఉండేవాడ్ని. అదొక్కటి లేకుండా ఉంటే బాగుండేదేమో. కొంచెం సన్నగా, ఇంకొంచెం తగ్గి సినిమాల్లోకి వచ్చి ఉంటే బాగుండేదేమో అనిపిస్తోంది.”
అయితే ప్రస్తుతం ఉన్న ఫిజిక్, ఫిట్ నెస్ పై పూర్తి సంతృప్తి వ్యక్తం చేశాడు తారక్. కొన్నాళ్లుగా ఫిట్ నెస్ బాగా మెయింటైన్ చేస్తున్నానని, ఇప్పుడు ఫిజిక్ పరంగా హ్యాపీగా ఉన్నానని అంటున్నాడు.
ఇక సినిమా విడుదల రోజు పడే టెన్షన్ పై కూడా ఎన్టీఆర్ స్పందించాడు. 30కి పైగా సినిమాలు చేసీన ఈ హీరో, ఇప్పటికీ రిలీజ్ రోజు టెన్షన్ పడతాడంట. రిలీజ్ ముందు రోజు రాత్రి నిద్ర పట్టదంట.
అయితే సినిమా విడుదల తర్వాత అది హిట్టయినా, ఫ్లాప్ అయినా కేవలం ఒకే ఒక్క రోజు తనపై ఆ ప్రభావం ఉంటుందంటున్నాడు ఎన్టీఆర్. మరుసటి రోజు నుంచి తిరిగి తన పనిలో పడిపోతానని చెబుతున్నాడు.

Manam matram evm lu ani edustu untam
Manam ayita elhanka lo relax
VV Vinayak
That is the plus point
ప్రశాంతం గా నిద్ర పోడానికే సినిమా లు తక్కువ చేస్తున్నాడు అంటారా 😂 ఏంటి ? 2018 నుంచి ఎన్ని రిలీజ్ అయ్యాయి?