జ‌న‌సేన ఎమ్మెల్యేను చిత‌క్కొడుతున్న నెటిజ‌న్లు!

టీడీపీ, జ‌న‌సేన పార్టీల అధినేత‌ల గుడ్‌లుక్స్‌లో ప‌డేందుకు మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌పై నోరు పారేసుకోవ‌డం ఆ పార్టీ నేత‌ల‌కు అల‌వాటైంది.

టీడీపీ, జ‌న‌సేన పార్టీల అధినేత‌ల గుడ్‌లుక్స్‌లో ప‌డేందుకు మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌పై నోరు పారేసుకోవ‌డం ఆ పార్టీ నేత‌ల‌కు అల‌వాటైంది.

పులివెందులో వైఎస్ జ‌గ‌న్‌ను ఓడిస్తామంటూ ప్ర‌గ‌ల్భాల‌రాయుళ్లు చాలా మందే ఉన్నారు. అలా మాట్లాడేవాళ్ల‌కు క‌నీసం సొంత స్థ‌లంలో గెలిచే సీన్ కూడా వుండ‌డం లేదు. అయిన‌ప్ప‌టికీ వాగుతూ వుంటామంటున్నారు. అలాంటి వాళ్ల‌కు బుద్ధి చెప్ప‌డానికి ఒక రోజు అంటూ వ‌స్తుంటుంది.

తాజాగా తూర్పుగోదావ‌రి జిల్లా రాజాన‌గ‌రం ఎమ్మెల్యే బ‌త్తుల బ‌ల‌రామ‌కృష్ణను నెటిజ‌న్లు రెండు రోజులుగా ఒక ఆట ఆడుకుంటున్నారు. సీతాన‌గ‌రం జెడ్పీటీసీ స్థానం నుంచి ఎమ్మెల్యే స‌తీమ‌ణి వెంక‌ట‌ల‌క్ష్మి ఓట‌మి మూట‌క‌ట్టుకున్నారు. వైసీపీ అభ్య‌ర్థి శ్రీ‌హ‌రిబాబు 2,600 ఓట్ల మెజార్టీతో విజ‌యం సాధించారు.

అంతేకాదు, ఆ నియోజ‌క‌వ‌ర్గంలోని సీతాన‌గ‌రంతో పాటు కోరుకొండ మండ‌లంలోనూ అత్య‌ధిక ఎంపీటీసీల‌ను కూడా వైసీపీ ద‌క్కించుకుంది. ఎమ్మెల్యే స్వ‌గ్రామం కోరుకొండ మండ‌లంలోని గాద‌రాడ‌. ఇక్క‌డ రెండు ఎంపీటీసీ స్థానాలుండ‌గా, ఒక చోట వైసీపీ గెలుపొందింది.

రాజ‌కీయాల్లో గెలుపోట‌ములు స‌హ‌జం. అయితే మాట‌లు జాగ్ర‌త్త‌గా వుండాలి. గ‌తంలో ఒక టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో జ‌న‌సేన ఎమ్మెల్యే బ‌లరామ‌కృష్ణ తీవ్ర ఆవేశంలో పులివెందుల‌లో జ‌గ‌న్‌ను ఓడిస్తామంటూ ప్ర‌గ‌ల్భాలు ప‌లికారు. త‌న భార్య‌ను జెడ్పీటీసీ మెంబ‌ర్‌గా గెలిపించుక‌నే సీన్ లేద‌ని, ఈయ‌న గారు జ‌గ‌న్ ఓడిస్తాడ‌ట అంటూ నెటిజ‌న్లు దెప్పి పొడుస్తున్నారు.

చివ‌రికి సొంత వూళ్లో కూడా జ‌న‌సేన‌ను గెలిపించుకోలేవంటూ ఎంపీటీసీ స్థానంలో ఓడిపోవ‌డాన్ని తెర‌పైకి నెటిజ‌న్లు తీసుకొచ్చారు. అధినేత‌ల మెప్పుకోసం, తాహ‌తుకు మించి మాట్లాడితే, ఇదిగో ఇలాంటి దుస్థితే వ‌స్తుంద‌ని జ‌నాలు చుర‌క‌లు అంటిస్తున్నారు.

14 Replies to “జ‌న‌సేన ఎమ్మెల్యేను చిత‌క్కొడుతున్న నెటిజ‌న్లు!”

  1. సొంత ఊర్లో వార్డు మెంబర్ నే గెలిపించుకోలేని మన A1సన్నాసి, why not కుప్పం అన్నప్పుడు ఈ నీతి సూక్తులు ఎక్కడ దాక్కున్నాయ్ అరికట్ల ఏ0కిటీ?

  2. “రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం. మాటలు జాగ్రత్తగా ఉండాలి.”

    మనమేనా ఈ మాటలు రాసేది. వాయమ్మో!!!! కొడాలి,వంశీ,రోజా,పేర్ని,అంబటి తదితరులు వాడిన భాష ఏంటి మరి.

    Cbn గెలిస్తే ఆయన బూట్లు తుడుస్తా అన్నప్పుడు ఎందుకు రాయలేదు ఇలాంటి ఆర్టికల్.

    అన్నని అంటే మాత్రం ఎక్కడలేని పౌరుషం వస్తుంది. ఎదుటి వాళ్ళని అంటే మాత్రం మన టైటిల్ ” నిప్పులు చెరిగిన……”

  3. దీన్ని బట్టి ఏం అర్థం అయింది.అతిగా వాగిన ఎవరైనా ఫలితం అనుభవించాల్సిందే! కూటమి లో అలాంటి వాళ్ళు కొద్ది మందే. మరి మన పార్టీ లో అందరూ అంతేగా!సో మనకే ఎక్కువ డ్యామేజ్ కదా!

    ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు????

  4. నారాయణ చైతన్య ర్యాంక్ లు చదివినట్టు చదవాలి మన అన్నియ సాధించిన సీటు లు…సున్నా..సున్నా..సున్నా…ఒకటి..ఒకటి..ఒకటి..రెండు..రెండు..రెండు…🤣

  5. నారాయణ చైతన్య ర్యాంక్ లు చదివినట్టు చదవాలి మన అన్నియ సాధించిన సీటు లు…సు'”న్నా..సు'”న్నా..సు!-న్నా…ఒ:’కటి..ఒ!;కటి..ఒ&_కటి..రెం!;డు..రెండు;:..రెండు…🤣

  6. ఒకటో ఆరో అక్కడక్కడ అభ్యర్ధులు లోకల్ పరిస్థితి లు బట్టి అటూ ఇటూ మారడం సహజం….ముఖ్యమంత్రి గా చేసి నోడు కనీసం ఓటు కూడా వెయ్యకుండా పోవడం మళ్ళా వా;డు పేజా స్వామ్య o అంటే G తో నవ్వుతారు.

  7. చివరి లైన్

    “అధినేతల మెప్పు కోసం ఇలా తాహతుకు మించి మాట్లాడితే ఇలాంటి దుస్థితే వస్తుందని జనాలు చురకలు అంటిస్తున్నారు”

    జనాలు మనకి చురకలు కాదు చురకత్తులు దింపారు మనకి,కొంచెం కొవ్వు ఎక్కువై దిగిన సంగతి తెలియట్లేదు మనకి.

Comments are closed.