ఎన్నో ఆశలతో కూటమిని ఉద్యోగులు అధికారంలోకి తెచ్చుకున్నారు. అయితే ఆశలన్నీ అడియాసలయ్యాయి. మోసపోయామన్న భావన వారిలో క్రమంగా పెరుగుతోంది.
కూటమి ప్రభుత్వంపై భ్రమలు తొలగడానికి రెండేళ్లు పట్టింది. దీంతో కూటమి సర్కార్‌పై తమ అసంతృప్తి, ఆగ్రహాన్ని ప్రదర్శించేందుకు అవకాశం కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగులకు…. స్థానిక సంస్థల ఎన్నికల రూపంలో దొరికింది.
2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి వైపు ఉద్యోగులు బలంగా నిలబెట్టారు. ఏకంగా 78 శాతం మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ మద్దతు ఇచ్చారు.
వైసీపీకి కేవలం 22 శాతం ఉద్యోగులు మాత్రమే మద్దతుగా నిలిచారు. గత సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 4.4 లక్షల పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో 3.4 లక్షల పైచిలుకు ఓట్లు కూటమికి లభించాయి. మిగిలిన ఓట్లు వైసీపీకి దక్కాయి.
ప్రస్తుతం పరిషత్ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్లలో కూటమి వైపే ఉద్యోగులు నిలిచారు. అయితే కూటమి, వైసీపీకి దక్కిన పోస్టల్ బ్యాలెట్ల ఓట్లను పరిశీలిస్తే, ఉద్యోగుల్లో వస్తున్న మార్పు స్పష్టంగా తెలుస్తుంది.
582 జెడ్పీటీసీ స్థానాల్లో 73,940 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పడ్డాయి. వీటిలో చెల్లనివి 4,120, నోటాకు 589 ఓట్లు పడ్డాయి. 69,231 ఓట్లు చెల్లే ఓట్లగా అధికారులు గుర్తించారు. వీటిలో కూటమికి 43,660 (63.06%), వైసీపీకి 22,494 (32.49%) ఓట్లు లభించాయి. ఎంపీటీసీ ఓట్ల విషయానికి వస్తే, ఉద్యోగుల ఓట్లు వైసీపీకి మరింతగా పెరిగాయి. అయితే ఆ లెక్కలు పూర్తిస్థాయిలో తెలియాల్సి వుంది.
ఇదిలా వుండగా సార్వత్రిక, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఉద్యోగుల్లో భారీ తేడాను గమనించొచ్చు. సార్వత్రిక ఎన్నికల్లో కూటమికి 78 శాతం ఉద్యోగుల ఓట్లు దక్కాయి. కానీ రెండున్నరేళ్ల పాలన పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో జెడ్పీటీసీ ఎన్నికల్లో కూటమికి 63 శాతం ఉద్యోగులు మద్దతుగా నిలిచారు. ఈ రెండున్నరేళ్లలో కూటమి 15 శాతం ఉద్యోగుల మద్దతును పోగొట్టుకుంది.
వైసీపీకి దాదాపు 10 శాతం ఉద్యోగుల మద్దతు పెరిగింది. ఈ పరిణామం కూటమికి తప్పకుండా షాక్ ఇచ్చేదే. ఇప్పటికీ ఉద్యోగులు తమ వైపే ఉన్నారని కూటమి గొప్పలు చెప్పుకోవచ్చు. ఎవరూ కాదనలేరు. కానీ తరుగుతున్న నమ్మకం గురించి కూటమి ప్రభుత్వం ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది.

అసలు అన్నియ ఉద్యోగులని పట్టించుకున్నది ఎప్పుడు? వాళ్ళ pf కూడా వాడుకు దొబ్బాడు
కూటమి వచ్చాక దాదాపు 30 వేల కోట్లు బాకీలు చెల్లించారు (మీ paytm జర్నలిస్ట్ సాయి cheppinde) అంత కన్నా ఎవరు మాత్రం చేయగలరు?
ఇప్పుడు అన్నియ కి ఓటు వేస్తే ఒరిగేది ఏమిటి?
అసలు ఒక్కసారి అయినా చర్చలు అయినా చేశాడా? సజ్జల మాట్లాడడం ఏంటో..
70% కూటమి తో ఉంటే షాక్ ఎందుకు?