వారణాసిపై రామాయణ ఎఫెక్ట్ ఎంత?

రామాయణ పార్ట్-1 వచ్చిన వెంటనే ఆదిపురుష్‌తో కంపేర్ చేసి చూశారు చాలామంది.

రామాయణ పార్ట్-1 వచ్చిన వెంటనే ఆదిపురుష్‌తో కంపేర్ చేసి చూశారు చాలామంది. అందులో ప్రభాస్‌ను, ఇందులో రణబీర్‌ను పోలుస్తూ, సోషల్ మీడియాలో చాలా విశ్లేషణలు కనిపిస్తున్నాయి. మరికొన్నాళ్లు ఆగితే.. అవే విశ్లేషణలు మహేష్ బాబు, రణబీర్ మధ్య కూడా వస్తాయి. ఇప్పుడీ పోలిక వారణాసి యూనిట్‌ను టెన్షన్ పెడుతున్నట్టుంది.

ఆదిపురుష్ డిజాస్టర్ సినిమా. సినిమాలో రామరావణ లుక్స్ నుంచి డైలాగ్స్, గ్రాఫిక్స్ వరకు ప్రతి విషయంలో లోపాలున్నాయి. దీంతో సహజంగానే ఆదిపురుష్, రామాయణ మధ్య పోలిక తీసుకొచ్చినప్పుడు రామాయణ చిత్రానికే ఎక్కువ ఓట్లు పడ్డాయి, ఇంకా పడుతున్నాయి కూడా.

వచ్చే ఏడాది సమ్మర్‌లో రాబోతున్న వారణాసి సినిమాలో మహేశ్ బాబు కూడా రాముడిగా కనిపించనున్నాడు. రణబీర్‌ను మించి మహేష్ లుక్ ఉండాలని, రామాయణ చిత్రాన్ని మించి వారణాసిలో రామాయణం ఎపిసోడ్ ఉండాలంటూ ఇప్పట్నుంచే పోస్టులు కనిపిస్తున్నాయి.

వారణాసి యూనిట్‌ను కచ్చితంగా ఇబ్బందిపెట్టే అంశం అది. ఎందుకంటే, రామాయణ పార్ట్-1 కంటెంట్ క్లిక్ అయింది. ప్రశంసలు దక్కుతున్నాయి. రణబీర్, యష్ లుక్స్‌తో పాటు గ్రాఫిక్స్‌ను అంతా మెచ్చుకుంటున్నారు. మరి ఈ స్థాయిలో వారణాసిలో మహేష్, రాముడి లుక్, గ్రాఫిక్స్ ఉంటాయా?

వారణాసి సినిమాలో ప్రతి ఎపిసోడ్ దేనికదే విభిన్నమైనదని ప్రకటించాడు రాజమౌళి. ఓ సినిమాకు ఎంత వర్క్ చేస్తామో, వారణాసిలో ఒక్కో ఎపిసోడ్‌కు అంత వర్క్ చేయాల్సి వచ్చిందన్నాడు. రాజమౌళి వర్క్ ఏ స్థాయిలో ఉంటుందో అందరికీ తెలిసిందే.

ఇప్పటివరకు ఆయన వర్క్‌ను మరో సినిమాతో పోల్చిచూసిన సందర్భం రాలేదు. ఎందుకంటే, ఆర్ఆర్ఆర్ అయినా, బాహుబలి అయినా, ఈగ, మగధీర లాంటి సినిమాలైనా వేటికవే ప్రత్యేకమైనవి. కానీ వారణాసిలో ‘రామాయణం ఎపిసోడ్‌’ను మాత్రం కచ్చితంగా తాజాగా వచ్చిన రామాయణ పార్ట్-1తో కంపేర్ చేసి చూస్తారు జనం.

అందులో రణబీర్‌ను, ఇందులో మహేష్‌ను కచ్చితంగా సరిపోల్చుతారు. ఇందులో గ్రాఫిక్స్‌ను, వారణాసిలో రామాయణం ఎపిసోడ్‌లో రాజమౌళి చూపించబోతున్న గ్రాఫిక్స్‌ను సరిపోల్చుతారు. ఈ ప్రెషర్ వారణాసి యూనిట్‌పై ఉండే ఉంటుంది. అంతేకాదు, ఇప్పటికే ఇంటర్నల్‌గా యూనిట్‌లో కీలక సభ్యుల మధ్య ఈ కంపారిజన్ జరిగే ఉంటుంది.

ఎందుకంటే, వారణాసిలో రామాయణ ఎపిసోడ్ షూటింగ్ ఎప్పుడో పూర్తయింది. ఈ ఎపిసోడ్ గ్రాఫిక్ వర్క్ కూడా కంప్లీట్ అయినట్టు గతంలోనే జక్కన్న వెల్లడించాడు. ఈ పోర్షన్ ఎడిటింగ్ వెర్షన్ కూడా తాజాగా లాక్ చేశారు.

సరిగ్గా ఇలాంటి టైమ్‌లో రామాయణ పార్ట్-1 వచ్చింది. మరి వారణాసిలో లాక్ చేసిన రామాయణం ఎపిసోడ్‌ను అలానే ఉంచారా? మళ్లీ ఏమైనా మార్పుచేర్పులు చేశారా? లేక రణబీర్ రామాయణ కంటే, తాము తీసిన రామాయణం ఎపిసోడే బ్రహ్మాండంగా ఉందని భావించారా?

2 Replies to “వారణాసిపై రామాయణ ఎఫెక్ట్ ఎంత?”

  1. అసలు దానికి దీనికి పోలిక ఏంటి?

    రామాయణం 7 గంటల సినిమా… ఇందులో ఒక ఎపిసోడ్ ఉంటుంది.. దానిలో రామాయణం మొత్తం చెప్పేస్తారా?

    ఇంక లుక్స్ అంటే.. ఎన్టీఆర్, శోభన్ ఎంతో బెటర్ గా వున్నారు ఈ రాముడి కంటే…

    నాగార్జున అన్నమయ్య ఏంటి.. మీసాలు ఏంటి అన్నారు.. రిజల్ట్ చూసాము కదా… ఇక్కడ కంటెంట్ ముఖ్యం 

Comments are closed.