ఇట్లు అర్జున.. చిన్న సినిమా. ఓ కొత్త హీరో నటించిన సినిమా. స్టార్ డైరక్టర్ తీసిన సినిమా కూడా కాదు. పెద్ద బ్యానర్ కూడా లేదు. కానీ ఈ సినిమాకు ప్రచారం చేసేందుకు నాగార్జున, ఎన్టీఆర్, రామ్ చరణ్.. ఇలా తారలంతా క్యూ కడుతున్నారు.
ఓ చిన్న సినిమాకు ఇంతమంది సీన్‌లోకి రావడంతో అంతా ఈ హీరోపై ఫోకస్ పెట్టారు. అసలు ఎవరీ అనీశ్. ఇతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? ఇలా ఆరాలు తీయడం మొదలుపెట్టింది సోషల్ మీడియా.
అనీశ్ చూడ్డానికి అమాయకంగా కనిపిస్తాడు. కానీ ఇతడి తండ్రి మాత్రం అంత అమాయకుడు కాదు. రియల్ ఎస్టేట్ రంగంలో ఏఎంఆర్ గ్రూప్ అధిపతి మహేశ్ రెడ్డి కొడుకే ఈ అనీశ్.
అనీశ్ తండ్రికి ఇండస్ట్రీ కొత్తకాదు. నాగార్జునతో 2 సినిమాలు నిర్మించారు. నాగ్ తో ఆయనకు మంచి అనుబంధం ఉంది. ఆ బంధంతోనే ఇట్లు అర్జున సినిమాను ప్రజెంట్ చేయడానికి ముందుకొచ్చారు నాగ్.
ఇక రీసెంట్‌గా రిలీజైన వీడియోలో ఎన్టీఆర్-అనీష్ చాలా క్లోజ్‌గా కనిపించారు. వీడియోలో వాళ్ల బాండింగ్ చాలామందికి ఆశ్చర్యం కలిగించింది కూడా. ఎన్టీఆర్ కుటుంబంతో, మహేష్ రెడ్డి కుటుంబానికి మంచి అనుబంధం ఉంది.
ఇప్పుడు తన పరిచయాలతో రామ్‌చరణ్ ను కూడా రంగంలోకి దించారు మహేష్ రెడ్డి. ఇలా తన కొడుకు అరంగేంట్రం కోసం ఎంత చేయాలో అంతా చేస్తున్నారీయన. ఈ మొత్తం ప్రచారంతో ఒకటి మాత్రం పక్కా. అనీష్ ఈ సినిమాతో ఆగడు. అతడు చాలా పెద్ద సినీ కెరీర్‌ను ఆశించి రంగంలోకి దిగుతున్నాడు.

ఇంతకీ హీరో pic యేదీ రా?
జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 25 లో మేఘా కృష్ణారెడ్డి ఇంటిపక్కన పెద్ద పెద్ద మెరుపు లైటింగ్స్ తో జిగేల్ మంటూ మెరిసే బంగ్లా ఈ మహేష్ రెడ్డిదే.
దూకుడు – ఆగడు
neevu inka chidathalu vaayinchadam start cheyi GA