Advertisement

Advertisement


Home > Movies - Movie News

మళ్లీ టాక్సీవాలా కాంబినేషన్

మళ్లీ టాక్సీవాలా కాంబినేషన్

గీతా సంస్థలో దర్శకుడు రాహుల్ సాంకృత్యయన్ అందించిన ఫాంటసీ థ్రిల్లర్ టాక్సీవాలా. విజయ్ దేవరకొండ మంచి హిట్ ల్లో అది ఒకటి. మళ్లీ ఆ కాంబినేషన్ ఇప్పుడు రిపీట్ అవుతోంది.

ఈసారి నిర్మాతలు మైత్రీ మూవీస్. విజయ్ దేవరకొండ లైన్ లో పెట్టుకున్న మూడు సినిమాల్లో ఇది మూడోది. ఒకటి సితార సంస్థలో గౌతమ్ తిన్ననూరి, రెండోది దిల్ రాజు- రవికిరణ్ కోలా సినిమా వున్నాయి. ఈ రెండూ ఇప్పటికే అనౌన్స్ అయ్యాయి. ఒకటి సెట్ మీద వుంది.

మూడో సినిమా కోసం ఓ కాన్సెప్ట్ పోస్టర్ ను రెడీ చేస్తున్నారు. రేపు విడుదల చేయబోతున్నారు. తను గతంలో అందించిన సినిమాల మాదిరిగానే ఈసారి కూడా ఓ భిన్నమైన సబ్జెక్ట్ ను తీసుకుంటున్నారు. కాన్సెప్ట్ పోస్టర్ అనౌన్స్ మెంట్ కోసం అందించిన చిన్న హింట్ తో కూడిన పోస్టర్ ఆ విషయాన్నే చెబుతోంది.

వరుస ఫ్లాపులతో బాధపడుతున్న విజయ్ దేవరకొండకు మంచి లైనప్ నే దొరికినట్లు కనిపిస్తోంది. గౌతమ్ తిన్ననూరి విభిన్నమైన సబ్జెక్ట్ ను ఎంచుకున్నారు. రాహుల్ కూడా అదే దారిలో వున్నారు. తను ఏ జానర్ చేసినా జనానికి దగ్గర కావడం లేదు సినిమాలు. అందువల్ల ఈసారి ఎంపిక దర్శకులకే వదిలేసినట్లు కనిపిస్తోంది విజయ్ దేవరకొండ.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?