Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఎన్టీఆర్ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ!

ఎన్టీఆర్ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ!

తమ అభిమాన హీరో సినిమాల అప్ డేట్ ల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తుంటారు ఫ్యాన్స్. ముఖ్యంగా తమ హీరో బర్త్ డే వస్తోంది అంటే మరీ ఆసక్తిగా వుంటారు. ఎందుకంటే అలాంటి బర్త్ డే నాడే పలు సినిమాల పోస్టర్లు, గ్లింప్స్, లుక్ ఇలా బోలెడు కంటెంట్ వస్తుందని ఆశ.

ఈ నెలలో వస్తోంది యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే. మే 20న. ఇప్పటికే దేవర కు సంబంధించి లుక్, గ్లింప్స్ లాంటివి వచ్చేసాయి. అందువల్ల ఆ సినిమా గురించి ఆసక్తి వుంది కానీ, మళ్లీ ఎక్కువ కంటెంట్ బయటకు వస్తుందని ఆశ లేదు.

కానీ ఇప్పటి వరకు వార్తల్లోనే, షూటింగ్ ల్లోనే వుంటూ వున్న ప్రాజెక్ట్ లు వున్నాయి. వార్ 2 నుంచి ఏదైనా పోస్టర్ వస్తుందని ఫ్యాన్స్ ఆశ. ఎన్టీఆర్ బాలీవుడ్ లుక్ ఎలా వుండబోతుందనే ఆశ. అలాగే ప్రశాంత్ నీల్- మైత్రీ మూవీస్ సినిమా అనౌన్స్ మెంట్ మరోసారి అఫీషియల్ గా రావాల్సి వుంది. షూటింగ్ ఎప్పటి నుంచి అన్న క్లారిటీ పక్కాగా ఈ బర్త్ డే నాడు వస్తుందనే నమ్మకంతో వున్నారు.

ప్రస్తుతానికి అయితే ఎన్టీఆర్ అఫీషియల్ గా ఓకె చేసిన ప్రాజెక్ట్ లు ఈ మూడే. ఇది కాక, బాలీవుడ్ లో వార్ 2 నిర్మాతలకే మరో సోలో హీరో సినిమా చేస్తారని టాక్ వుంది. హారిక సంస్థ-త్రివిక్రమ్ కాంబినేషన్ లో భారీ సినిమా వుంటుందని నిర్మాత నాగవంశీ గతంలో చెప్పారు. అందువల్ల ఎన్టీఆర్ బర్త్ డే వస్తోంది అంటే ఎన్ని విశేషాలు వస్తాయో అని ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?